అల్లం పాడు గ్రామం లో స్కూల్ బిల్డింగ్ నిర్మాణం వెంటనే చేపట్టాలి

అల్లం పాడు గ్రామం లో స్కూల్ బిల్డింగ్ నిర్మాణం వెంటనే చేపట్టాలి

అల్లంపాడు గిరిజన గ్రామంలో.    స్కూల్ బిల్డింగు నిర్మించి విద్యార్థులకు ఆదుకోవాలని  స్కూలు పిల్లలతో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది.    ఈ సందర్భంగా సర్పంచ్ రామయ్య మాట్లాడుతూ మా అల్లం పాడు గ్రామం వద్ద స్కూల్ బిల్డింగ్ నిర్మాణం వెంటనే చేపట్టాలని బిల్డింగ్ లేకపోవడం వలన విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులు కష్టాలు పడుతున్నారని అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకపోవడం చాలా బాధాకరం అని ఆవేదన వ్యక్తం చేశారు.  ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి. సిఐటియు నాయకులు కోరాడ ఈశ్వరరావు మాట్లాడుతూ.    గిరిజన విద్యార్థుల పట్ల పాలకులు నిర్లక్ష్యం మానుకొని అభివృద్ధి పథంలో నడపాలని వెంటనే స్కూల్ బిల్డింగ్ నిర్మించాలని అన్నారు. పాచిపెంట మండలం తుమరవల్లి నేరడవలస కమ్మరి జోల కరకవలస కొండలుద్దండి బొడ్డపాడు.   ఈ గిరిజన గ్రామాల్లో స్కూల్ బిల్డింగ్ లేక ప్రజల సహకారంతో రేకుల షెడ్ల వద్ద చెట్లు కింద ఎక్కడో ఇంటి ముందర చదువు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఇప్పటికైనా గిరిజన ప్రాంతాల అభివృద్ధి కావాలంటే విద్యారంగం పైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి గిరిజనులకు అభివృద్ధి పథంలో నడిపించాలని అన్నారు ఇప్పటికే అనేక గిరిజన ప్రాంతాల్లో స్కూలు మొదలుపడ్డాయని.  ఎటువంటి సౌకర్యాలు లేకపోతే   పిల్లలు డ్రాప్ అవుట్ పెరిగి చదువుకు దూరం అవుతారని ఆవేదన వ్యక్తం చేశారు.   ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ మరియు ఐటీడీఏ పీవో ఉన్నతాధికారులంతా ఏజెన్సీ హిల్ టాప్ గిరిజన ప్రాంతాలను పర్యటించి ఇటువంటి మౌలిక సమస్యలు పరిష్కారం కోసము మరియు స్కూల్ బిల్డింగ్ నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి అభివృద్ధి చేయాలని అన్నారు.   రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు అడవి తల్లి పాట అని పేరుతో గిరిజనులు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు అభివృద్ధి గిరిజనులు జరగాలంటే ఎంతో ఉన్నత స్థాయికి గిరిజనులు వెళ్లాలంటే విద్యారంగాన్ని అభివృద్ధి చేయాలి తప్ప ఇంకొక మార్గం లేదని తెలిపారు  రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ఈ బిల్డింగులను నిర్మాణం చేపట్టాలని లేదంటే ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పోరాటాన్ని ఉదృతం చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో క్యారంగి సర్పంచ్ సోముల లచ్చయ్య మద్దతు తెలిపారు రహదారుల నిర్మాణం చేపట్టి స్కూల్ బిల్డింగులు నిర్మాణం చేపట్టాలని కోరారు గ్రామ పెద్దలు కోటపర్తి లచ్చయ్య. డప్పు సింహాద్రి తదితరులు పాల్గొన్నారు.   ఐటీడీఏ పీవో కాలెక్టర్ వెంటనే స్పందించి స్కూల్ బిల్డింగులు నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి