వినూతన రీతిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఫోటో పట్టుకొని డోలీ మొతలు మోసుకొని ఆకులు ఒల్లంత కట్టుకొని అడవి శాఖ అధికారుల తీరుకు వ్యతిరేకంగా రహదారి కోసం నిరసన

*ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కాదు సుమారు 79 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చినప్పుడు కూడా ఈ గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం పూర్తిస్థాయిలో కల్పించకపోవడం చాలా అన్యాయం*
*పాలకుల మారుతున్నారు శంకుస్థాపన చేస్తున్నారు పనులు పూర్తి కాకుండా మధ్య లో రహదారి పనులు వదిలేస్తున్నారు తప్ప పూర్తి స్థాయిలో రహదారి సౌకర్యం కల్పించకపోవడంతో కాలినడకతో వెళ్ళలేక ఆటోలతో రాలేక గర్భిణీ స్త్రీలు విద్యార్థులు స్కూలుకి వెళ్లే ఉపాధ్యాయులు అనేక రకాలుగా ఇబ్బందులు పడే పరిస్థితి ఉందని
రెండు పంచాయితీలు సుమారు 20 గ్రామల గిరిజనుల  పరిస్థితి ఇంత దారుణంగా మారిందని
ఇప్పటికైనా ఏదైతే ఐదు కోట్లు మజురు చేశామని ఈనెల 11వ తేదీన కురుపాం ఓపెనింగ్ ఎమ్మెల్యే గారు గౌరవ శ్రీ తోయక జగదీశ్వరి గారు శంకుస్థాపన చేసిన నాలుగు రోజులకే ఆ గ్రామాల రోడ్డు పనులు జరుగుతున్న నేపథ్యంలో అడవి శాఖ అధికారులు జెసిపిని అడ్డుకున్న పరిస్థితి వచ్చిందని పనులు జరుగుతున్న నేపథ్యంలో జెసిపిని అడ్డుకోవడం తగదని కాబట్టి ఇప్పటికైనా అడవి శాఖ అధికారులు తీరు మారాలని ఈ విషయం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్లాలని కోరుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పంచాయతీకి సంబంధించిన గిరిజన గ్రామాల ప్రజలతో పాటు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఫోటో పట్టుకొని గిరిజన ప్రజలు ఆకులతో నడుముకి కట్టుకొని డోలీ మొతలు మోస్తూ వినూతన రీతిలో అటు నయా మరియు ఇటు గుడ్డం రహదారి వద్ద నిరసన కార్యక్రమం చేశామని అన్నారు. ఈ నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం పార్టీ జిల్లా కమిటీ కొల్లి సాంబమూర్తి మాట్లాడుతూ ఆవకొమరాడ మండలానికి సంబంధించి మారుమూల గిరిజన పంచాయితీ నయా పంచాయతీలో సుమారు తొమ్మిది గ్రామాలతో పాటు అటు కుంతేసు పంచాయతీకి సంబంధించిన తొమ్మిది గ్రామాలకు సంబంధించి ఎంతో ప్రధానమైన ఛీ సాడ వలస నుండి సంకేసు మీదుగా నయా గ్రామం వరకు రహదారి సౌకర్యం లేకపోవడంతో అనేక ఇబ్బందులు పడే పరిస్థితి ఉందని ఇలాంటి సందర్భంలో గత వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా కొంతవరకు రోడ్డు వేస్తామని రాళ్లు వేశారు తప్ప పూర్తిస్థాయిలో రోడ్డు పనులు నిర్మించకపోవడం నడవలేని పరిస్థితిలో ఉన్నామని మరి ఇలాంటి సందర్భంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐదు కోట్ల రూపాయలు మంజూరయ్యవని చెప్పి సి సాడ వలస గ్రామము నుండి నయా గ్రామం రోడ్డు పనులు ఈనెల 11వ తేదీన కురుపాం నియోజకవర్గ ఎమ్మెల్యే టి జగదీశ్వరి గారు పనులు ప్రారంభించడం జరిగిందని అయితే పనులు జరుగుతాయని సంతోషిస్తున్న నేపథ్యం ప్రారంభించిన నాలుగు రోజులకే అడవి శాఖ అధికారులు వచ్చి అనుమతులు లేవని చెప్పి పనులు చేస్తున్న జెసిపిని అడ్డుకోవడం జరిగిందని ఇది చాలా అన్యాయమని కాబట్టి ఈ విషయం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్లే విధంగా ఈరోజు గిరిజన ప్రజలందరము కలిసి ఈ నిరసన* *కార్యక్రమం అనేది చేయడం జరిగిందని అన్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి