మక్కువ మండల గిరిజన గ్రామాలకు రగ్గులు పంపిన డిప్యూటీ సీఎం
పార్వతీపురం /మక్కువ, జులై 30 : మక్కువ మండలంలోని ఆరు గిరిజన గ్రామాలకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రగ్గులను పంపించారు. బుధవారం 6 గిరిజన గ్రామాలలో రగ్గులు పంపిణీ కార్యక్రమం జరిగింది. మండలంలోని బాగుజోలలో 24 కుటుంబాలు, చిలక మెండంగి లో 48 కుటుంబాలు, బెండమెడంగిలో ఐదు కుటుంబాలు, తాడిపుట్టిలో 10 కుటుంబాలు, దోయ్ వర లో ఐదు కుటుంబాలు, సిరివరలో 130 కుటుంబాలు వెరసి 222 కుటుంబాలకు, కుటుంబానికి మూడు రగ్గులు చొప్పున పంపిణీ జరిగింది. రగ్గులు పంపిణీ పట్ల గిరిజనులు సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుత వర్షాకాలం సీజన్ మరియు రానున్న శీతాకాలం సీజన్ లో రగ్గులు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని వారి పేర్కొన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గుర్తుపెట్టుకుని ప్రత్యేక శ్రద్ధతో రగ్గులు పంపించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.



