డిజిటల్ బుక్ ఆవిష్కరణ

డిజిటల్ బుక్ ఆవిష్కరణ

డిజిటల్ బుక్ ఆవిష్కరణ


పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గం లో మాజీ ఉపముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర తన కార్యాలయం లో డిజిటల్ బుక్ ని అవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తరువాత రాష్ట్రంలో భారత రాజ్యాంగం అమలు కాకుండా రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారన్నారు.పరిపాలన గాలికొదలి వైకాపా కార్యకర్తలను,ప్రజలను వేధింపులకు గురిచేస్తున్నారన్నారు.ఇటువంటి సమయంలో కార్యకర్తలకు,ప్రజలకు అండగా ఉండేందుకు వైకాపా అధినాయకత్వం డిజిటల్ బుక్ ని ప్రవేశపెట్టి వేధిస్తున్న అధికారులు,నాయకుల వివరాలను ఆధారాలతో సహా డిజిటల్ బుక్ లో పొందుపరిచేలా డిజిటల్ బుక్ ని రూపొందించారన్నారు.డిజిటల్ బుక్ రెడ్‌బుక్ కి పోటీ గా పెట్టింది కాదన్నారు.అన్యాయానికి గురవుతున్న కార్యకర్తలను ఆదుకోవడమే డిజిటల్ బుక్ ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు.ప్రశాంతంగా ఉండే సాలూరు నియోజకవర్గం లో ఎమ్మెల్యే గా సంధ్యారాణి ఎన్నిక అయిన తరువాత ప్రత్యర్ధి పార్టీ నాయకులను రెచ్చగొట్టే వాఖ్యలు చేస్తున్నారన్నారు.మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని సాలూరు ఎమ్మెల్యే సంధ్యారాణి సంభోదించే తీరు ఆక్షేపనీయమన్నారు.అన్యాయానికి గురవుతున్న వారు డిజిటల్ బుక్ లో నమోదు కొరకు వైకాపా సోషల్ మీడియా ను లేదా తన కార్యాలయానికి సంప్రదించాలని కోరారు…..

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి