పార్వతీపురం, ఫిబ్రవరి 23 : జిల్లాలో జరుగుతున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ పరీక్షా గదులను సందర్శించి, విద్యార్థులకు కల్పించిన వసతులను స్వయంగా పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. పరీక్షా కేంద్రాల్లో సిసి కెమెరాల నిఘా ఉండాలని, మాల్ ప్రాక్టీస్ జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని విద్యార్థులకు తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని, గదుల్లో వెలుతురు, ఫ్యాన్లు సరిగ్గా ఉండేలా చూడాలని ఆదేశించారు. విద్యార్థులు పరీక్షా కేంద్రానికి సకాలంలో చేరుకోవాలని, నిమిషం నిబంధన అమల్లో ఉన్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద ఒక ఏఎన్ఎం మరియు ప్రాథమిక చికిత్స కిట్ అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. అనంతరం కేంద్రంలో ఏర్పాటుచేసిన సౌకర్యాల పట్ల విద్యార్థులతో ముచ్చటించి వివరాలు తెలుసుకున్నారు. ఈ తనిఖీలో కళాశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. Spread the love టపా నావిగేషన్ నేటి నుంచి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు