*కోట్ల కృష్ణ* – జనసేన పార్టీ ఉమ్మడి విజయనగరం జిల్లా కో-ఆర్డినేటర్, రాష్ట్ర ప్రచార కమిటీ.
తన తమ్ముడు కోట్ల నవీన్ డిగ్రీ చదువుతూ పోటీ పరీక్షలకు సిద్ధపడుతూ, జనసేన పార్టీ యొక్క ఆశయ సిద్ధాంతాలకు కట్టుబడి క్రియాశీలకమైన వ్యక్తిగా జనసేనలో పనిచేస్తూ, దూరదృష్టపు శాత్తు రైలు ప్రమాదంలో మృతి చెందడం జరిగింది. తనకి యాక్సిడెంట్ జరిగిన సమయంలో కూడా తన అన్నయ్య అయినటువంటి కోట్ల కృష్ణ ప్రమాదం జరిగిన రోజు అదే సమయానికి జనసేన పార్టీ కార్యక్రమంలో ఉండడం విశేషం. తన తమ్ముడికి నామినినే కాకుండా క్రియాశీలక వాలంటీర్ గా కూడా తనే ఉండడం విశేషం, చిన్నతనంలోనే తల్లిదండ్రులు కోల్పోయిన కోట్ల కృష్ణ తన తమ్ముళ్లను ఉన్న స్థితిలో నిలపడం కోసం చిన్న చిన్న ఉద్యోగాలు చేసి ఉన్నతమైన చదువులు చదువుతూ ముఖ్యంగా దేశానికి సేవ చేసుకోవాలని ఉద్దేశంతో సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాస్తూ, ఆంధ్ర యూనివర్సిటీలో Ph.D రీసర్చ్ స్కాలర్గా చేస్తూ పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలకు, ఆయన ఆశయాలకు ఆకర్షితుడై జనసేన పార్టీలో
చీపురుపల్లి నియోజకవర్గం సమన్వయకర్త అయినటువంటి *శ్రీ విసినగిరి శ్రీనివాసరావు* గారి ఆధ్వర్యంలో చేరిన కోట్ల కృష్ణ గారు నెల్లిమర్ల నియోజకవర్గ శాసన సభ్యురాలు *శ్రీమతి లోకం నాగ మాధవి* *గారు* , చీపురుపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు *శ్రీ కిమిడి కళా వెంకట్రావు గారి* సారథ్యంలో పనిచేసి జిల్లా వ్యాప్తంగా పార్టీని బలోపేతం చేయడంలో ఎంతగానో కృషి చేసి రాష్ట్ర ప్రచార కమిటీకి ఉమ్మడి విజయనగరం జిల్లా కో-ఆర్డినేటర్ గా, మంచి వక్తగా వ్యవహరిస్తూ క్రియాశీలక వాలంటీర్ గా ఎంతోమందికి సభ్యత్వాలు చేస్తూ మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొని కూటమి మరియు పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు.