అక్టోబర్ 4వ తేదీ అనగా రేపు శుక్రవారం కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగే ధర్నా జయప్రదం చేయండి
సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు వై మన్మధరావు జిల్లా కమిటీ సభ్యులు కొల్లి సాంబమూర్తి భవన కార్మికులకు ట్రాక్టర్ కార్మికులకు ఇతర పెయింటింగ్ కార్మికులకు పిలుపు
ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు వై మన్మధరావు సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు సాంబమూర్తి మాట్లాడుతూ పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండల కేంద్రంలో సిపిఎం పార్టీ కొమరాడ మండల కమిటీ ఆధ్వర్యంలో రేపు అనగా అక్టోబర్ 4వ తేదీ శుక్రవారం ప్రభుత్వం గతంలో చెప్పిన మాదిరిగా ఉచిత ఇసుక హామీని తక్షణమే అమలు చేయాలని భవన ట్రాక్టర్ కార్మికులకు ఉపాధి కల్పించాలని జరిగే ధర్నా కార్యక్రమానికి కొమరాడ మండలంలో గల భవన కార్మికులు ట్రాక్టర్ కార్మికులు ఇతర పెయింటింగ్ పనులు చేస్తున్న కార్మికులు పెద్ద ఎత్తున ధర్నాకు కదలి రావాలని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి ముందుగా ఈ సందర్భంగా కోరుతున్నాం. కొమరాడ మండలంలో భవన కార్మికులు మరియు ట్రాక్టర్ కార్మికులు మరియు ఇతర పెయింటింగ్ వర్కులు చేసే కార్మికులు సుమారు 5000 మంది వరకు ఉన్నారని వీరందరూ గత ప్రభుత్వం ఆయాములో ఇసుక లభించకపోవడం రేట్లు పెరిగిపోవడం విచ్చల విడి అవినీతి వల్ల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఏర్పడిందని దీనివల్ల గత ప్రభుత్వంలో పేదవారు అనేవారు ఇల్లు కట్టుకోలేక అప్పుల పాలయ్యే పరిస్థితి ఉందని అలాగే మంత్రులు ఎమ్మెల్యేలు కాంట్రాక్టర్లు విపరీతంగా ఎండ అనగా వాన అనక రాత్రి పగలు అనే తేడా లేకుండా ఇసుకను విజయనగరం విశాఖపట్నం రాజమండ్రి వరకు తీసుకువెళ్లి కోట్లాది రూపాయలు అవినీతికి పాల్పడ్డారని ఈలాంటి సందర్భంలో గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని పథకాలకు బటన్ నొక్కారు తప్ప ఒక్క ఇసక భవన కార్మికులకు ఆదుకునే విధంగా ఒక్క బటన్ కూడా నొక్కక పోవడం వల్ల భవన కార్మికులు ట్రాక్టర్ కార్మికులు ఇతర కార్మికులు జీవనోపాధి లేక గుంటూరు ఏలూరు వలసలు వెళ్లే పరిస్థితి ఉందని అనేకమంది భవన కార్మికులు ఇతర వృత్తిలో ఉన్న కార్మికులు ఆదాయం లేక అప్పుల చేసి తీర్చుకోలేక ఆత్మహత్యలు కు పాల్పడే పరిస్థితి ఉందని ఇలాంటి సందర్భంలో భవన కార్మికులు ఎన్నో విధాలుగా ఆందోళన చేసినప్పటికీ కనీసం గత ముఖ్యమంత్రి గౌరవనీయులైన వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా భవన కార్మికుల సమస్యను గాలికి వదిలే పరిస్థితి ఉందని ఇలాంటి సందర్భంలో వైయస్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని వర్గాల కార్మికులు తగిన బుద్ధి చెప్పి మొన్న జరిగే ఎన్నికల్లో అతి గోరంగా ఓడించారని ఇలాంటి సందర్భంలో అప్పుడు ప్రతిపక్షంలో ఉండే సందర్భంలోనూ మరియు మొన్న జరిగే ఎన్నికల ముందు ఇప్పటి ముఖ్యమంత్రి గౌరవనీయులైన నారా చంద్రబాబునాయుడు గారు భవన కార్మికులకు ట్రాక్టర్ కార్మికులకు ఇతర కార్మికులకు అన్ని విధాలుగా ఆదుకునే విధంగా గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా ఇసుక ఉచితంగా ఇస్తామని చెప్పడం జరిగిందని ఇలాంటి సందర్భంలో కూటమి ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన గౌరవనీయులైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు వంద రోజులు అయినప్పటికీ కూడా కొమరాడ మండలంలో గల గత ప్రభుత్వంలో నిర్వహించిన కొమరాడ కొట్టు క ల్లికోట రాంబద్రపురం గుమడ దళాయిపేట ఇసుక రీచ్లు ఉన్నప్పటికీ కూడా ఒక్క ఇసుక రీచ్ ను కూడా నేటికీ వంద రోజులైనా ప్రారంభించిన నేపథ్యంలో భవన కార్మికులు ఉపాధి లేక చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉందని కాబట్టి ఇలాంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం అందరికీ ఉచితంగా ఇసుక లభించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని అందరికీ అందుబాటులోకి ఇసుక రీచులను తీసుకురావాలని అవినీతిని అరికట్టాలని భవన నిర్మాణ మరియు ట్రాక్టర్ కార్మికులకు ఉపాధి చూపాలని చూపాలని నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించాలని భవన నిర్మాణాలు చేసుకునే వారిపై అధిక భారం లేకుండా చూడాలని ఈ విధంగా కార్మికులకు అన్ని విధాలుగా భరోసా కల్పించే విధంగా ఆదుకోవాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చే వరకు కార్మికులందరూ ఐక్యతతో పారాడవలసిన అవసరం ఎంతైనా ఉందని ఇలాంటి ఈ సందర్భంలో అక్టోబర్ 4వ తేదీ అనగా రేపు శుక్రవారం పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన ఉదయం 10 గంటలకు జరుగుతుందని కాబట్టి ప్రతి ఒక్కరు శుక్రవారం ఉదయం 10 గంటలకు ఆర్టీసీ కాంప్లెక్స్ వద్దకు చేరుకొని ర్యాలీగా కలెక్టర్ కార్యాలయం వద్దకు వెళ్లి అక్కడ ఆందోళన జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని ఈ సందర్భంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కార్మికులకి కోరుతున్నాము ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు సత్యం సింహాచలం నాగభూషణ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు ఉపేంద్ర వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు రెడ్డి శివ నాయుడు గిరిజన సంఘం నాయకులు లక్ష్మయ్య బలరాం సుబ్బారావు మధు కైలాస్ సుందర్రావు వెంకట్రావు సుబ్బారావు భవన కార్మికుల సంఘం నాయకులు అప్పలనాయుడు పెద్దెత్తిన భవన కార్మికులు పాల్గొన్నారు
కొమరాడ మండల కేంద్రంలో పత్రిక విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న నాయకులు ఫోటో నాయకులు మాట్లాడుతున్న వీడియో చూడగలరు