శుభోదయం లోగో ఆవిష్కరణ కార్యక్రమంలో డాక్టర్ బి.హెచ్. సుమిత్రానందన్‌కు ఘన సన్మానం

శుభోదయం లోగో ఆవిష్కరణ కార్యక్రమంలో డాక్టర్ బి.హెచ్. సుమిత్రానందన్‌కు ఘన సన్మానం

విజయవాడ, అక్టోబర్ 22:

విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన శుభోదయం లోగో ఆవిష్కరణ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్, జై ఆంధ్ర (జై భారత్) వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ బి.హెచ్. సుమిత్రానందన్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జై ఆంధ్ర (జై భారత్) సమాచార హక్కు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వెంకట నారాయణ మాట్లాడుతూ, శుభోదయం నూతన లోగో ఆవిష్కరణ సందర్భంగా సంస్థ యాజమాన్యానికి అభినందనలు తెలిపారు. శుభోదయం చైర్మన్ శ్రీ కె. లక్ష్మీ ప్రసాద్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

సమాజానికి సమాచారాన్ని అందించడంలో మీడియా సంస్థల పాత్ర ఎంతో కీలకమని, ప్రజలకు నిష్పక్షపాతమైన సమాచారాన్ని అందిస్తూ ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు మీడియా కృషి చేయాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

కార్యక్రమంలో శుభోదయం చైర్మన్ శ్రీ కె. లక్ష్మీ ప్రసాద్, ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ డీజీపీ కార్యాలయం ఓఎస్‌డీ శ్రీ సి.హెచ్. రామారావు, డాక్టర్ బి.హెచ్. సుమిత్రానందన్‌ను ఘనంగా సన్మానించారని రాష్ట్ర అధ్యక్షులు వెంకట నారాయణ తెలిపారు.

విజయదశమి శుభ సందర్భంగా నిర్వహించిన ఈ లోగో ఆవిష్కరణ కార్యక్రమం శుభోదయం సంస్థకు మరింత గుర్తింపు, అభివృద్ధి తీసుకురావాలని పలువురు ఆకాంక్షించారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి