గరివిడి: స్థానిక పశువైద్య కళాశాలలో ఈరోజు మధ్యాహ్నం సమయంలో “వసుంధర వాల్యూమ్ – 3” అనే మ్యాగజైనను డాక్టర్ ముఖ్యఅతిథిగా విచ్చేసిన డాక్టర్ కే కృష్ణమూర్తి గారు జాయింట్ డైరెక్టర్ పశుసంవర్ధక శాఖ కాకినాడ వారి సమక్షంలో మరియు గారా రంగనాథం గారు సాహితీవేత్త, జీ వి శ్రీనివాస్ గారు అధ్యక్షులు సాహితీ సంఘం విజయనగరం వారు మరియు సీ సన్యాసిరావు ఎడిటర్ విశాఖ సంస్కృతి మాసపత్రిక సమక్షంలో చేతుల మీదుగా ఆవిష్కరణ చేయబడింది. ఈ కార్యక్రమానికి కళాశాల అసోసియేటీ  డీన్ గారు పిల్లలు ఉద్దేశించి ఇలాంటి అన్ని రంగాల్లో విద్యార్థుల్లో పోటీ తత్వాన్ని అలవర్చుకోవాలని కోరారు. అదేవిధంగా మ్యాగజైన్ కు చీఫ్ ఎడిటర్ అయిన డాక్టర్ ఆలపాటి అనిత గారు మాట్లాడుతూ పిల్లల్లో మంచి సృజనాత్మకతను వెలికి తీయడానికి ఇలాంటి పత్రికలు మరింత అవసరమని కొనియాడారు. అదేవిధంగా విద్యార్థి వ్యవహారాల అధికారి డాక్టర్ వై ఆర్ అంబేద్కర్ గారు మాట్లాడుతూ ఇది పిల్లల యొక్క సమిష్టి కృషి అని వారిని ఇందులో భాగస్వాములు చేసి ఈ పత్రికను ప్రతి సంవత్సరం రిలీజ్ చేసేలాగా ప్రణాళికలు కళాశాల అసోసియేటె డీన్ గారు తీసుకున్నారని చెప్పారు. ఈ కార్యక్రమానికి సుమారు 250 మంది విద్యార్థులు మరియు 25 మంది అధ్యాపకులు పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఉత్సాహపరితంగా ముగించారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి