స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలైనా ఇంకా ఎన్నాళ్లు ఈ డోలి మో తలు! ఇంకా ఎన్నాళ్లు ఈ కష్టాలు !

స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలైనా ఇంకా ఎన్నాళ్లు ఈ డోలి మో తలు!!! ఇంకా ఎన్నాళ్లు ఈ కష్టాలు !
ఈ కష్టాలకు కారణం ఎవరు?


కేవలం 350  మీటర్ల దూరానికి రోడ్డు వేయడానికి ఇంకా ఎన్ని సంవత్సరాల కాలం అటు ఐటీడీఏ అధికారులకు  పాలకులకు కావాలి?


వెంటనే ఐటిడిఏ అధికారులు స్పందించి కొమరాడ మండలంలో chinnakergala పంచాయతీ పరిధిలో గల సీసా డ వలస గ్రామానికి బట్టి మొగవలస కి వెళ్లే తారురోడ్డు నుండి వెంటనే సీసాడ వలస గ్రామానికి సిసి రోడ్డు గానీ తారు రోడ్డు గాని వేసి అన్ని విధాలుగా గ్రామస్తులు ఆదుకోవాలని కోరుతూ సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కొల్లి సాంబమూర్తి సీసాడ వలస గ్రామం నుండి పత్రిక విలేకరులతో మంగళవారం మాట్లాడుతూ ఈరోజు అనగా మంగళవారం సీసాడవలసి గ్రామానికి చెందిన కొండ గొర్రె నికిత అనే గర్భిణీ స్త్రీకి ఉదయం పురిటి నొప్పులు రావడంతో వెంటనే ఆ గ్రామంలో ఉన్న ఆశా వర్కర్ అగ్గమ్మ అంగన్వాడి టీచర్ వరలక్ష్మమ్మ స్పందించి వెంటనే గ్రామానికి చెందిన కొంతమంది యువకులు 108 కి ఫోన్ చేయగా 108 వాహనం ఆ ఊరు సమీపంలో గల బట్టి మొగ వలసకెళ్లే తారు రోడ్డు వద్ద ఉన్న మామిడి చెట్టు వద్దకు 108 వచ్చి సీ శాడవలసి గ్రామానికి రహదారి బాగు లేకపోవడంతో ఆ గ్రామానికి 108 వెళ్ళక ఆ చెట్టు వద్ద 108 వాహనం ఆగిపోవడంతో నికిత భర్త కొండ గొర్రె పారయ్య మరియు గ్రామస్తులు ఆశ వర్కర్లు అంగనబడి టీచర్ మంచం పైన గర్భిణీ స్త్రీని మోసుకొని 108 వాహనం ద్వారా భర్త పారయ్య ఆశ వర్కర్ అగ్గమ్మ అత్త పొన్నమ్మ కలిసి పార్వతీపురం జిల్లా కేంద్ర హాస్పిటల్ కి  తీసుకెళ్లడం జరిగింది ఆస్పత్రిలో వెంటనే వైద్య సిబ్బంది స్పందించి కాన్పు అయ్యేదాకా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని అక్కడ చెప్పడం జరిగింది. ఏదేమైనా కేవలం 350 మీటర్ల దూరానికి గాను గడిచి 76 సంవత్సరాలైనా గ్రామానికి తారు రోడ్డు గాని సిసి రోడ్డు గానీ  లేకపోవడం చాలా అన్యాయం ఏ కలెక్టర్ గారు జాయిన్ అయినా రోడ్లు వేస్తామని చెప్పి పత్రిక ప్రకటన ఇచ్చిన తర్వాత బదిలీ అయి వెళ్ళిపోతున్నారు తప్ప ఎక్కడ రోడ్లు కూడా పూర్తిస్థాయిలో రోడ్లు వేయండి పరిస్థితి ఉందని ఇకనైనా జిల్లా కలెక్టర్ గారి స్పందించి ప్రతి గిరిజన గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించి విద్య వైద్యం అందించే విధంగా చొరవ తీసుకోవాలని ఆ దిశగా వెంటనే  ఐటీడీఏ అధికారులు స్పందించి ఈ గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించి అన్ని విధాలుగా పై గ్రామాన్ని ఆదుకోవాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పార్వతిపురం మన్యం జిల్లా కలెక్టర్ గారికి మరియు ఐటిడిఏ అధికారులకు విన్నవించుకుంటున్నాము

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *