*ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలి*
*అడ్డాపుశీల శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం ప్రాంగణంలో గిరి ప్రదక్షిణ ప్రారంభించిన పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర*
ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండి సమాజ సేవ చేయాలని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు. గురువారం పార్వతీపురం మండలం అడ్డాపుశీల శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే శివలింగానికి పాలాభిషేకం, క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్రానికి అభివృద్ధి చేస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజా ప్రతినిధులు ముఖ్యంగా రాష్ట్ర ప్రజలు, నా నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని, నియోజకవర్గ అభివృద్ధి చేయడానికి పూర్తిస్థాయి శక్తిసామర్థ్యాలు నాకు ఇవ్వాలని ఆ భగవంతుని వేడుకున్నానని అన్నారు. ఎమ్మెల్యేతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.












