తేదీ 27/12/2025,శనివారం చీపురుపల్లి పట్టణం లో వైస్సార్ పార్టీ నాయకులు ఇప్పిలి అనంతం, వలిరెడ్డి శ్రీనివాసనాయుడు పత్రికా సమావేశంలో మాట్లాడుతూ స్థానిక MLA కిమిడి కళావెంకటరావు గారు పత్రికా సమావేశాల పెట్టి మానాయకులు మీద విమర్శలు కాకుండా నియోజకవర్గం సమస్యలు మీద ద్రుష్టి పెట్టండి. ప్రజలు సంతోషిస్తారు అని హితవు పలికారు.చీపురుపల్లి పట్టణంలో వైస్సార్ పార్టీ నాయకులు జిల్లా వైస్సార్ పార్టీ జనరల్ సెక్రటరీ ఇప్పిలి అనంతం, జిల్లా పబ్లిసిటీ వింగ్ అధ్యక్షులు వలిరెడ్డి శ్రీనివాసనాయుడు,పట్టణ అధ్యక్షులు పతివాడరాజారావు మాట్లాడుతూ స్థానిక MLA కిమిడి కళావెంకటరావు గారు మా నాయకులు మాజీ ముఖ్యమంత్రి వై యస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి,శాసనమండలి ప్రతిపక్ష నాయకులు బొత్స సత్యనారాయణ గారి గురుంచి నిన్న పత్రికా సమావేశంలో విమర్శలు చేస్తూ మా నాయకులు మీద రాజద్రోహం కేసు పెట్టాలని మతిలేని మాటలు కళావెంకటరావు గారు మాట్లాడుతున్నారు అని అన్నారు, ఈ రాష్ట్రంలో గతంలో ఏ ముఖ్యమంత్రులు చేయలేని విదంగా ప్రతి గ్రామంలో సచివాలయాలు,రైతుభరోసా కేంద్రాలు,పీహెచ్ సి సబ్ సెంటర్స్ పెట్టి మహాత్మా గాంధీ కలలు కన్న గ్రామస్వరాజ్యం స్థాపించినందుకు జగన్మోహన్ రెడ్డి గారు మీద రాజద్రోహం కేసు పెట్టాలా అని అన్నారు,నాడు నేడు కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో గవర్నమెంట్ స్కూల్స్ అన్ని బాగు చేసి, ఇంగ్లీష్ మీడియం పెట్టి పేదపిల్లలకి మంచి చదువులు చదివించి ఐబీ సిలబస్ పెట్టి, పేద పిల్లలకు మంచి విధ్య అందించిన బొత్స సత్యనారాయణ గారి మీద రాజద్రోహం కేసు పెట్టాలా అని విమర్శించారు,బ్యాంకు లను కొల్ల గొట్టిన వైట్ కాలర్ నేరస్తుడిని డిప్యూటీ స్పీకర్ గా పెట్టి మీరు నీతులు మాట్లాడుతారా, తీవ్ర వాదులు కన్నా ఘోరంగా రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారా రాష్ట్రంలో మీరు చేసిన అరాచకం ప్రజలు అందరికి తెలుసు, అరాచక వాధుల్లా చంద్రబాబు తెలుగుదేశం కూటమి నాయకులు గత ప్రభుత్వం లో జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన 17ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రెవేట్ పరం చెయ్యడానికి టెండర్స్ పిలిస్తే ఒక్కరూ టెండర్స్ వెయ్యడానికి రాకపోయే సరికి చంద్రబాబు నాయుడు గారికి మీకు మతి బ్రమించి మా నాయకులు ని విమర్శలు చేస్తున్నారు అని అన్నారు,మా నాయకులు ని విమర్శలు చేసినంత మాత్రాన మీకు మంత్రి పదవి దక్కదు అని ప్రజలు నియోజకవర్గం లో మిమ్మల్ని MLA గా గెలిపించినందుకు నియోజకవర్గం సమస్యల మీద ద్రుష్టి పెడితే ప్రజలు సంతోషిస్తారని, ఎన్నికలు ముందు మీ నాయకులు లోకేష్, చంద్రబాబు, మీరు గెలిస్తే 100 రోజుల్లో చీపురుపల్లి RECS ను APDCL నుంచి మళ్ళీ RECS గా మారుస్తామన్నారు 18 నెలలు అయ్యింది మీరు ముందు దాని మీద ద్రుష్టి పెట్టండి అని అన్నారు, అలాగే చీపురుపల్లి ప్రజలకు ఎంతో ఉపయోగకరమైన గవర్నమెంట్ హాస్పిటల్ ను 100 పడకలు హాస్పిటల్ గా అప్ గ్రేడ్ GO తెచ్చి డాక్టర్స్ నియామకం కూడా చేస్తే దాన్ని నిర్మాణం చెయ్యకుండా 18 నెలలుగా కాలయాపన చేస్తున్న మీ లాంటి చేత కానీ నాయకులు మీద ప్రజలు తప్పకుండా రాజద్రోహం కేసు పెడతారు అని అన్నారు, నియోజకవర్గం లో ఏమారు మూల పల్లెకు వెళ్లిన రోడ్డు లు అన్ని బొత్స సత్యనారాయణ గారు హయాంలో నిర్మాణం చేసినవే, మీరు మీటింగ్ లు పెట్టిన 4మండలాల MDO ఆఫీస్, RDO ఆఫీస్ అనేక ఆఫీస్ లు బొత్స సత్యనారాయణ గారి హయాంలో కట్టినవే,చీపురుపల్లి నియోజకవర్గం వచ్చి మీరు త్రాగుతున్న మంచి నీరు కూడా బొత్స సత్యనారాయణ గారు సంకిలి నుంచి తీసుకుని వచ్చినవే అని అన్నారు, అసలు అధికారంలోకి వచ్చి18 నెలలు అవుతుంది మీరు నియోజకవర్గం కి చేసిన ఒక్క పని కానీ రూపాయి నిధులు కానీ ఉంటే చెప్పాలని అన్నారు, ఇక నైనా ప్రెస్ మీట్ లు విమర్శలు మాని అభివృద్ధి మీద ద్రుష్టి పెట్టాలని లేదంటే ప్రజలు తగిన బుద్ధి చెపుతారని హితవు పలికారు,ఈ కార్యక్రమం లో జిల్లా జనరల్ సెక్రటరీ ఇప్పిలి అనంతం, జిల్లా పబ్లిసిటీ వింగ్ అధ్యక్షులు వలిరెడ్డి శ్రీనివాసనాయుడు,టౌన్ ప్రెసిడెంట్ పతివాడరాజారావు,సర్పంచ్ లు మీసాల రమణ, కోరాడ పృథ్విరాజ్,రేవల్ల సత్తిబాబు, గవిడి సురేష్, ముజకీర్, వెంకీ, రాంకీ,మురళీ పాల్గొన్నారు. Spread the love టపా నావిగేషన్ జగన్ – బొత్సలకు చెంపపెట్టు: అభివృద్ధి నిరోధకులకు కాలం చెల్లింది గుర్ల మండలం జమ్ము పేట లోనీ వైసీపీ పార్టీ నుంచి వార్డ్ మెంబర్ తో సహా 25 కుటుంబాలు జనసేన పార్టీలో చేరిక