చీపురుపల్లి మండలం పేరిపి గ్రామంలో  చీపురుపల్లి  మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు భారీ ఉచిత పశువైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, యువనేత శ్రీ కిమిడి రామ్ మాలిక్ నాయుడు  ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

శిబిరాన్ని ప్రారంభించిన అనంతరం రామ్ మాలిక్ నాయుడు  పశువులకు టీకాలు వేసే ప్రక్రియను పర్యవేక్షించారు. అనంతరం రైతులకు ఉచితంగా మందుల కిట్‌లను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “రైతు కేవలం సాగుపైనే కాకుండా, అనుబంధ రంగమైన పశుపోషణపై కూడా ఆధారపడి జీవిస్తున్నాడు. అటువంటి పాడి రైతులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని, వైద్య సేవలను చేరువ చేయడం చాలా అవసరం. చీపురుపల్లి మార్కెట్ కమిటీ వారు ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయం. భవిష్యత్తులో కూడా ఇలాంటి మరిన్ని శిబిరాలు నిర్వహించి రైతులను ఆదుకోవాలి” అని కోరారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి