అటవీ పోడు భూములకు పూర్తిస్థాయిలో పట్టాల మంజూరు చేయాలని పాచిపెంట మండలం గరిసిగుడ్డి పంచాయతీ చిమ్డి వలస వద్ద సిపిఎం ఆధ్వర్యంలో గిరిజనులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా గిరిజనులు వలసి రాజు లక్ష్మయ్య మాట్లాడుతూ పోడు భూములకు పూర్తి స్థాయిలా పట్టాలు మంజూరు చేయలేదని కొంతమందికి ఇచ్చారు చాలామందికి ఇవ్వలేదని వాటికి కూడా పూర్తిస్థాయిలో ఐదు ఎకరాలు సాగులో ఉంటే ఎకరం నారా ఎకరం చొప్పున పట్టాలు ఇచ్చారని మిగతా చాలా వరకు దరఖాస్తులు పెట్టుకున్న పట్టాల మంజూరు చేయలేదని అన్నారు అటవీ హక్కులు చట్టం ప్రకారం పట్టాల మంజూరు చేయాలని అన్నారు వీరికి మద్దతుగా సిపిఎం జిల్లా నాయకులు కోరాడ ఈశ్వరరావు మాట్లాడుతూ అటవీ హక్కుల చట్టాన్ని పగ్బంది గా అమలు చేసి గిరిజనుల కి సాగు హక్కులు కల్పించాలని 2005 సంవత్సరం ఆటవికులు చెక్క వచ్చిన నేటికి పూర్తిస్థాయిలో పట్టాల మంజూరు చేయకపోవడం వలన గిరిజనులు తీవ్రమైన ఇబ్బందులు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే పూర్తిస్థాయిలో పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో గిరిజనులు మహిళలు పాల్గొన్నారు.


