ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రవేశపెట్టిన
*స్వర్ణాంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర* కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్  ఆదేశాలు అనుసరించి
కమిషనర్ టి. టి రత్న కుమార్  ఆధ్వర్యంలో
పురపాలక సంఘ పరిధిలో ఉన్న పెద్ద మార్కెట్ *గాంధీ పార్క్* వద్ద   వ్యాపారస్తులందరినీ ఆహ్వానించి *స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ్ ఆంధ్ర*
ఆరోగ్యకర జీవన విధానం, పర్యావరణ పరిరక్షణలో కోసం 
రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల మూడవ శనివారం స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని, కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలన్నారు.
*జీరో లిట్టర్ గవర్నెన్స్,* అనే నినాదం తో పరిశుభ్రమైన చెత్త లేని ప్రదేశాల కోసం  కమ్యూనిటీలను శక్తివంతముగా చేయడం ఆరోగ్యకరమైన నమ్మకంగా  మరియు పరిశుభ్రమైన వాతావరణాన్ని కొనసాగించడానికి స్థానిక యాజమాన్యాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ప్రతి ఒక షాప్ ముందు డస్ట్ బిన్ తప్పకుండా ఉంచాలని తమ షాపు నుండి వచ్చిన వ్యర్థాలను డస్ట్ బిన్ లో వేసి మున్సిపల్ వాహనానికి అందించాలని సూచించారు.ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో కొంత అవగాహన కలుగుతుందన్నారు. ఎలక్ట్రానిక్, ప్లాస్టిక్ వ్యర్ధాలను మున్సిపాలిటీ వారికి అప్పగిస్తే వారు తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. పరిశుభ్రత చోటుచేసుకున్న ప్రాంతాల్లో అక్కడ ఆహ్లాదకర వాతావరణం కల్పిస్తే ఆ ప్రదేశంలో చెత్తవేసేందుకు ఎవరికీ మనస్సు రాదన్నారు. రోజువారీ అవసరాల కోసం ప్లాస్టిక్ కవర్ల స్థానంలో కాటన్ బ్యాగులు ఉపయోగించాలని కోరారు. రోడ్లపై వ్యర్థాలు వేయరాదని, చెత్త కనిపిస్తే డస్ట్ బిన్ లో వేయాలని కోరారు. స్వచ్ఛ కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించడం ద్వారా పట్టణం శుభ్రంగా ఉంటుందన్నారు. ప్రజలకు పరిశుభ్రమైన గాలి, నీరు అందించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని చెప్పారు.ప్రజలు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో స్వచ్ఛ దివస్ కార్యక్రమాలను మరింత విస్తృతంగా చేయబడతామన్నారు. స్వచ్ఛత కోసం ప్రతి పౌరుడు కలిసి రావాలని, ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా శుభ్రత పై ప్రత్యేక దృష్టి సాధించాలని, జిల్లాను స్వచ్ఛ సాలూరుగా తీర్చిదిద్దడానికి ప్రజలందరూ సహకారం కావాలని కోరారు .
ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్  L. బాలకృష్ణ గారు, D.E ప్రసాద్ గారు, A.E అలేఖ్య స్వామి గారు పెద్ద మార్కెట్ వ్యాపారస్తులు, స్థానిక ప్రజలు సచివాలయ శానిటేషన్ కార్యదర్శిలు, మరియు సిబ్బంది పాల్గొనడం జరిగింది.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి