జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా జర్నలిస్టులకు శుభాకాంక్షలు
ప్రశ్నించే గొంతుకలను అణచివేయొద్దు.. అవినీతిని ప్రశ్నించే జర్నలిస్టులకు రక్షణ కల్పించాలి: డాక్టర్ బి.హెచ్. సుమిత్రానందన్
రాజమహేంద్రవరం, నవంబర్ 16:
జాతీయ పత్రికా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ ఏపీ, తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ బి.హెచ్. సుమిత్రానందన్ జర్నలిస్టులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం సమాజంలో ప్రజా సమస్యలను, అవినీతిని ప్రశ్నిస్తున్న వారిపై కేసులు నమోదు చేయడం ఆందోళన కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అవినీతిని ప్రశ్నించే జర్నలిస్టులపై దాడులు చేయడం, వారిని ఇబ్బందులకు గురిచేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని పేర్కొన్నారు.
పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలని, ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో జర్నలిస్టులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.
ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వెల్ఫేర్ అసోసియేషన్‌ను 2015లో స్థాపించామని, అప్పటి నుంచి ఈ అసోసియేషన్ ద్వారా జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేస్తున్నామని తెలిపారు.
అనంతరం జై ఆంధ్ర సమాచార హక్కు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పి. వెంకటనారాయణ మాట్లాడుతూ అసోసియేషన్ నూతన కమిటీ వివరాలను త్వరలో మీడియా ద్వారా ప్రకటిస్తామని వెల్లడించారు.
– 9NEWS తెలుగు
