సాలూరు నియోజకవర్గం లో కూటమి ఎమ్మెల్యేగా గెలుపొందిన శ్రీ గుమ్మడి సంధ్యారాణి గారికి సాలూరు పట్టణ అంగన్వాడీలు ఘనంగా సన్మానించారు. ఈ సన్మాన కార్యక్రమం ఏపీ అంగన్వాడీ యూనియన్ అధ్యక్షురాలు బలగ రాధ ఆధ్వర్యంలో జరిగింది. సాలూరు నియోజకవర్గ చరిత్రలో ఇప్పటివరకు మహిళా ఎమ్మెల్యే లేరని మొట్టమొదటి సారిగా మహిళ ఎమ్మెల్యేగా శ్రీ గుమ్మడి సంధ్యారాణి గారు గెలుపొందటం సాలూరు మహిళలు గర్వపడే విజయం అని అంగన్వాడీ కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేశారు