పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు
మాజీ డిప్యూటీ సీఎం రాజన్న దొర విలేకర్ల సమావేశం
తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ పథకాలు ఎప్పుడు అమలు చేస్తారో తెలియజేయాలని ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని మాజీ డిప్యూటీ సీఎం రాజన్న దొర అన్నారు. ఓటు కి నోటు నాయకులు ఇద్దరూ రెండు రాష్ట్రాలకు సీఎంలు అయ్యారని ప్రజలకు పథకాల నోట్లు పంచిన సీఎం ఓడిపోయారని అన్నారు. వైసిపి ఓడి పోవడానికి కారణం సూపర్ సిక్స్ పథకాలని అటువంటి పథకాలు మీరు తొందరగా అమలు చేయాలని తెలియజేశారు. ఈ పథకాలు ఎప్పుడూ అమలు చేస్తారో సీఎం చంద్రబాబు నాయుడు అయినా గిరిజన శాఖ మంత్రి సంధ్యారాణి తెలియజేయాలి అని మాజీ డిప్యూటీ సీఎం రాజన్న కోరారు. ఎన్నికల సమయంలో విమర్శలు ఎలాగో చేశారు కానీ ఎన్నికల తర్వాత కూడా విమర్శలు చేయడం సరికాదని ఆయన తెలియజేశారు. రాష్ట్రానికి ప్రజలకే కావాల్సింది విమర్శలు కాదని అభివృద్ధి చేయాలని ఆయన పత్రిక ముఖంగా కోరారు. సాలూరు నియోజకవర్గం లో జ్యూట్ ఫ్యాక్టరీ గత కొన్ని ఏళ్ల గా మూతపడిందని దీని తెరిపించడానికి తమ హయాంలో చాలా ప్రయత్నాలు చేశానని అది అప్పుడు జరగలేదని, ఫ్యాక్టరీ తెరిపిస్తానని హామీ ఇచ్చి గెలిచిన సంధ్యారాణి ఈ ఫ్యాక్టరీని ఎప్పుడు తెరిపిస్తారో చెప్పాలని ప్రశ్నించారు