DRC సమావేశంలో చర్చించిన గౌరవ చీపురుపల్లి శాసనసభ్యులు కిమిడి కళావెంకట రావు ఈరోజు విజయనగరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన జిల్లా అభివృద్ధి సమీక్షా కమిటీ (DRC) సమావేశంలో తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రివర్యులు మరియు చీపురుపల్లి శాసనసభ్యులు గౌరవ శ్రీ కిమిడి కళావెంకట రావు గారు పాల్గొన్నారు. జిల్లా ఇన్-ఛార్జ్ మంత్రి శ్రీమతి వంగలపూడి అనిత గారు, జిల్లా మంత్రి శ్రీ కొండపల్లి శ్రీనివాస్ గారు, జిల్లా కలెక్టర్, ఎస్పీ మరియు ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి జిల్లాలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులపై ఆయన సమీక్షించారు. ముఖ్యంగా చీపురుపల్లి నియోజకవర్గంలోని ప్రజా సమస్యలు,రహదారుల నిర్మాణం మరియు సంక్షేమ పథకాల అమలుపై అధికారులకు కీలక సూచనలు చేశారు. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించేందుకు అందరం సమన్వయంతో పనిచేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. Spread the love టపా నావిగేషన్ ఉచిత మెగావైద్య శిబిరాన్ని ప్రారంభించిన డాక్టర్ బొత్స అనూష పేరిపి గ్రామం లో ఉచిత పశువైద్య శిబిరం