హైడ్రోపవర్ ప్రాజెక్టు అనుమతులను వెంటనే రద్దు చేయాలని ోరుతూ పాచిపెంట మండల కేంద్రంలో ఆర్టీసీ కాంప్లెక్స్ గాంధీ బొమ్మ ఆవరణ నుండి ఎమ్మార్వో కార్యాలయం వద్దకు ర్యాలీగా వెళ్లి హైడ్రోపవర్ ప్రాజెక్టు వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మార్వో కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. హైడ్రో పవర్ ప్రాజెక్టు వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు డి పండు. శిల్పజన్ని రామయ్య.గరిసి గుడ్డి సర్పంచ్ ఆనంద్ తంగలం సర్పంచ్ పోయ్ అప్పన్న మూటకూడు సర్పంచ్ మల్లేష్ గొట్టూరు సర్పంచ్ సింహాచలం ఎంపీటీసీ చదల రాజు. ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం.జరిగింది.ఈ కార్యక్రమానికిముఖ్య అతిథిగా హాజరైన. ఆదివాసి గిరిజన సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు శ్రీధరపు అప్పారావు మాట్లాడుతూ. షెడ్యూలు ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజన ప్రాంతాల్లో గిరిజనుల యొక్క అనుమతి లేకుండా. డ్రోన్లు పెట్టి సర్వేలు చేసి సర్వే రాలును పాతడం చట్టరీత్యా నేరం. ఇటువంటి నవయుగ అదాని పవర్ హైడ్రో పవర్ ప్రాజెక్టు కంపెనీలపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీసి కేసులను నమోదు చేయాలని అన్నారు. పోరాడి సాధించుకున్నటువంటి జీవోలను గిరిజన హక్కులను కాలరాస్తు ఆగమేఘాల మీద నవయుగ కంపెనీకి 13 నెంబర్ జీవో ఇచ్చి గిరిజనులను ఆదివాసీలందరినను జల సమాధి చేసి గిరిజన ప్రాంతంలో హైడ్రోపవర్ ప్రాజెక్టు పేరుతో ఖనిజ సంపాదన తరలించే కు ట్రలో భాగంగా ఇటువంటి నియంత పద్ధతులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు అటవీ హక్కుల చట్టాన్ని సక్రమంగా అమలు చేయాలని వీసా చట్టాన్ని పగడ్బందీగా అమలుచేసి గిరిజన హక్కులు చట్టాలను కాపాడాలని హైడ్రో పవర్ ప్రాజెక్ట్ వలన గిరిజలకు ఉపాధి కలుగుతుందని తప్పుడు ఆరోపణలు మానుకొని గిరిజన ప్రాంతాల్లో అడవి తల్లి బాట అని పేరుతో గిరిజనులను ఆడవుల నుండి వెళ్ళగొట్టే కుట్రలు ప్రభుత్వాలు మానుకోవాలని అన్నారు.హైడ్రోపవర్ ప్రాజెక్టు కమిటీ నాయకులు పండు మాట్లాడుతూ. గిరిజనులను జల సమాధి చేసే విధంగా ప్రభుత్వాలు పూనుకోవడం సరైనది కాదని దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తామని ప్రభుత్వాలు గిరిజనుల పక్షాన నిలబడి అటువకుల చట్టాన్ని పగడ్బందీగా అమలు చేసి గిరిజనులకు అభివృద్ధి బాటలో నడిపించాలని డిమాండ్ చేశారు.హైడ్రో పవర్ ప్రాజెక్ట్ వ్యతిరేక పోరాట కమిటీ సభ్యురాలు సన్నమ్మ మాట్లాడుతూ అడవిలో ఉన్నటువంటి ప్రకృతి సంపదతో నేటి వరకు బ్రతికామని దుంపలు ఆకులు ఎదురు కంజులు తిని బతికాము ఈ ప్రాంతం నుంచి వెళ్ళగొట్టడం చూస్తే ప్రాణాలైనా వదులుకుంటాం తప్ప భూములు వదులుకోమని అన్నారు .హైడ్రోపవర్ ప్రాజెక్టు వ్యతిరేక పోరాట కమిటీ కమిటీ.కన్వీనర్ కోరాడ ఈశ్వరరావు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్పోరేట్లో పెట్టుబడిదారులు లాభాలు తప్ప ప్రజల సమస్యలను గాలికి వదిలేసి ఈ విధంగా కొద్దిమందికి ప్రజలు సంపదని దోచిపెట్టె విధానాలను చేయడం సమంజసం కాదని ఎప్పటికైనా గిరిజన ప్రాంతాల అభివృద్ధికి బాటలు వేయాలని లేనియెడల హైడ్రోపవర్ ప్రాజెక్టు వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో మిగతా ప్రజా సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన పోరాట కార్యక్రమాలను చేపడతామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఐదు పంచాయతీల కు సంబంధించిన గిరిజన యువత ప్రజలు పాల్గొన్నారు. హైడ్రో పవర్ ప్రాజెక్టు అనుమతులు రద్దు చేసే విధంగా రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ గుమ్మడి సంధ్యారాణి గారు ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు లేనియెడల ఆందోళన పోరాటాలను ఉదృతం చేస్తామని డిమాండ్ చేశారు. అనంతరం పాచిపెంట మండలం తాసిల్దార్ గారైన రవికుమార్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది తాసిల్దార్ గారు మాట్లాడుతూ ఈ సమస్యలను కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తానని పై అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆది వాసి గిరిజన సంఘం జిల్లా కమిటీ సభ్యులు జన్నిరామయ్య మంచాల శ్రీనివాసరావు పీసా చట్టం ఉప ప్రెసిడెంట్ జర్నీ సుబ్రమణ్యం శ్రీరాములు మర్రి రాజు ముఖి రామస్వామితదిత లు పాల్గొన్నారు





