వంట నూనెల కొనుగోలు చేసేటప్పుడు ఎక్స్పైర్ డేట్ చూసుకోండి.

వంట నూనెల కొనుగోలు చేసేటప్పుడు ఎక్స్పైర్ డేట్ చూసుకోండి.

మీరు వంట నూనె కొంటున్నారా జాగ్రత్తగా చూసుకొని కొనండి ఆయిల్ టిన్ ల పై ఉండే expair date చూసుకోండి. ఆ expair date ఉన్న దగ్గర నిశితంగా గమనించండి మీకు ఈ మోసం అర్థమవుతుంది.expair date అయిపోయిన oil టిన్ లకు Expair date దగ్గర ప్రత్యేక స్టిక్కర్లు అంటించి వారికి నచ్చిన date వేసుకుంటూ కొన్ని టీన్ లేపి ఏకంగా date,month,year తో స్టాంప్ తయారు చేసుకొని వేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు కొంత మంది హోల్ సేల్ వ్యాపారస్తులు. ఈ మాయాజాలమంత పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణం లోనే జరగడం గమనార్హం. ఇటువంటి ఆయిల్ టిన్ లను గిరిజనులు ఎక్కువగా కొనుగోలు చేసే ప్రదేశాలు అయిన సాలూరు పట్టణం లో గల పెద్ద మార్కెట్ తో పాటు ఏజెన్సీ ప్రాంతంలో గల సంతల్లో ఎక్కువగా వ్యాపారం చేసే వ్యాపారస్తులకు తక్కువ రేటుకు హోల్ సేల్ గా అమ్ముతూ కల్తీ ఆయిల్ తో దందా సాగిస్తున్నారు సాలూరు పట్టణం ఆయిల్ డీలర్లు, హోల్ సేల్ వ్యాపారస్తులు. దీనిపై ఫిర్యాదు అందుకున్న పార్వతీపురం మన్యం జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ వినోద్ సాలూరు పట్టణంలో గల ఆయిల్ షాపులు కిరాణా షాపులు లో తనిఖీలు నిర్వహించి కాలం చెల్లిన వంట నూనెలు అమ్ముతున్న 2షాప్ ల పై కేసులు నమోదు చేశారు. కాలం చెల్లిన వస్తువులు అమ్మితే కేసులు నమోదు చేసి కటిన చర్యలు తీసుకుంటామని తెలిపారు

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి