పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో నారాయణ స్కూల్ లో పదవీ స్వీకరణ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో పాఠశాల విద్యార్థుల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సాలూరు పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్
బి .అప్పలనాయుడు ప్రిన్సిపాల్ శివకుమార్ పాల్గొన్నారు. నాయకుడికి ఉండవలసిన లక్షణాలు మరియు నాయకుడిగా ఎలా ఎదగాలో అనే విషయాన్ని చక్కగా విద్యార్థులకు వివరించారు. చిన్నతనం నుంచే నాయకత్వ లక్షణాలు అలవరుచుకోవాలని చెప్పారు. అనంతరం పాఠశాలలో ఎన్నికైన నాయకులకు బ్యాడ్జీల ను ఇచ్చి అభినందించారు. అదేవిధంగా ఈ వేడుకల్లో పిల్లలు సాంస్కృతి గురించి కార్యక్రమాల్లో మరియు పాటల్లో పాల్గొని వేడుకకు ముఖ్య ఆకర్షణగా నిలిచారు. ఈ కార్యక్రమం సాఫ్ట్ స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో జరిగింది .ఈ వేడుకల్లో పాఠశాల సిబ్బంది మరియు తల్లిదండ్రులు పాల్గొని విజయవంతం చేశారు


