పార్వతీపురం, ఫిబ్రవరి 22 : జిల్లాలో నేటి నుంచి ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని జిల్లా కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి విద్యార్థులకు పిలుపునిచ్చారు. పరీక్షలు ఉదయం 9:00 గంటల నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు జరుగుతాయని, విద్యార్థులు గంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని, ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించరని కలెక్టర్ స్పష్టం చేశారు. పరీక్షల్లో అక్రమాలకు తావులేకుండా ప్రతి కేంద్రం వద్ద సిసిటివి కెమెరాలను ఏర్పాటు చేశారని, ఫ్లయింగ్ స్క్వాడ్లు, సిట్టింగ్ స్క్వాడ్లతో నిరంతర నిఘా ఉంటుందన్నారు. పరీక్షా కేంద్రంలోకి సెల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లు, క్యాలిక్యులేటర్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించరని చెప్పారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ప్రథమ చికిత్స మందులు అందుబాటులో ఉంటాయని, నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా ఆదేశించినట్లు తెలిపారు. విద్యార్థులు సకాలంలో కేంద్రాలకు చేరుకోవడానికి వీలుగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోందని, పరీక్షలు విద్యార్థుల భవిష్యత్తుకు ఎంతో కీలకమన్నారు. కాపీయింగ్ వంటి అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని, విద్యార్థులు క్రమశిక్షణతో పరీక్షలు రాసి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని, సమీపంలోని జిరాక్స్ సెంటర్లు పరీక్షా సమయంలో మూసి ఉంచాలని కలెక్టర్ ఆదేశించామన్నారు. Spread the love టపా నావిగేషన్ విచ్చలవిడిగా బెల్ట్ షాపులు.. చోద్యం చూస్తున్న అధికారులు ఇంటర్ పరీక్షా కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్