*పట్టణంలో లార్వా నిరోధక రసాయనాల పిచికారి*
పట్టణంలో నిర్వహిస్తున్న పారిశుధ్య స్పెషల్ డ్రైవ్ ను డిప్యూటీ డిఎంహెచ్ఓ శివకుమార్ మరియు మలేరియా యూనిట్ ఈశ్వరరావు సాలూరు పురపాలక ఇన్చార్జ్ కమిషనర్ జి. శ్రీరామ్ మూర్తి సానిటరీ ఇన్స్పెక్టర్ ఫకీర్ రాజు పర్యవేక్షణ చేశారు. పట్టణంలో వివిధ వార్డులలో గురువారం చేపట్టిన కాలువల్లో పూడిక తీత, దోమల లార్వా నివారణ పిచికారీ కార్యకలాపాలను స్వయంగా పరిశీలించారు. దోమల లార్వా వృద్ధి చెందకుండా, దోమలు వ్యాప్తిని అరికట్టేందుకు లార్వా నిరోధక రసాయనాలను పిచికారి చేయించడం జరిగిందన్నారు. నీరు నిల్వ ఉండకుండా కాలువలలో పూడికలు తీయించడం జరిగిందని, తద్వారా దోమలు ప్రబలకుండా సీజనల్ జ్వరాలు అదుపులో ఉండేందుకు నియంత్రణ చర్యలు చేపడుతున్నామన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరారు. జిల్లాలో ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్ ను నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా చేపట్టడం జరిగిందని ఆయన చెప్పారు. దోమలపై దండ యాత్ర చేసి వ్యాప్తి నివారణ చేస్తామని, మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులకు అవకాశం లేకుండా అన్ని చర్యలు చేపట్టడం జరిగిందని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ శివకుమార్ మున్సిపల్ ఇంచార్జ్ కమిషనర్ జి శ్రీరామ్ మూర్తి మలేరియా యూనిట్ సిబ్బంది సానిటరీ ఇన్స్పెక్టర్ ఫకీర్ రాజు సిబ్బంది సిబ్బంది పాల్గొన్నారు.