కలలకు నిలయం కలల కానాచి విజయనగరం జిల్లా గరివిడిలో ఉభయ తెలుగు రాష్ట్రాల ఆహ్వాన నాటిక పోటీలను వచ్చే నెల మే 9,10 మరియు 11 వ తేదీల్లో నిర్వహిస్తున్నట్లు గరివిడి కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షులు వాకాడ గోపి తెలియజేశారు. మూడు రోజులు పాటు 8 నాటికలను మొదటిరోజు రెండు నాటికలు 9వ తేదీ న రెండు నాటికలు, 10వ తేదీ న మూడు నాటికలు, మరియు 11వ తేదీ రెండు నాటికలను ఉభయ తెలుగు రాష్ట్రాల వారిచే ప్రదర్శిస్తున్నట్లు గరివిడి కల్చరల్ అసోసియేషన్ తెలియజేసింది.
ఈ సందర్భంగా గరివిడి కల్చరల్ అసోసియేషన్ నాటిక పోటీల కరపత్రాలను అసోసియేషన్ సభ్యులు విడుదల చేశారు.మూడు రోజులు పాటు రోజుకు ఒకరు చొప్పున ముఖ్య అతిథులను సినీ సెలబ్రిటీల్ని తీసుకొచ్చే ఆలోచనలో కల్చరల్ అసోసియేషన్ సంప్రదింపులు జరుగుతున్నట్లు అసోసియేషన్ సభ్యులు తెలియజేశారు





