అభివృద్ధి క్రెడిట్ కొట్టేయాలని చూడటం సిగ్గుచేటు

అభివృద్ధి క్రెడిట్ కొట్టేయాలని చూడటం సిగ్గుచేటు


వైసీపీ నేతలవి దొంగచాటు,కొబ్బరి కాయలు కొట్టడం, బ్రిడ్జ్ పై,ప్రెస్ మీట్ లు, ప్రారంభోత్సవాలు – అభివృద్ధి క్రెడిట్ కొట్టేయాలని చూడటం సిగ్గుచేటు: ఎన్డీయే కూటమి నాయకుల ధ్వజం


చీపురుపల్లి నియోజకవర్గంలో అభివృద్ధిని అడ్డుకోవడమే కాకుండా, పూర్తయిన పనులపై తమ స్టిక్కర్లు వేసుకోవాలని చూడటం వైసీపీ నేతలకు అలవాటుగా మారిందని ఎన్డీయే కూటమి నాయకులు మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు గారి ఆదేశాల మేరకు సోమవారం చీపురుపల్లి తెదేపా కార్యాలయంలో కూటమి నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ..
ROB ప్రారంభోత్సవంపై వైసీపీ డ్రామాలు..
విజయనగరం-పాలకొండ రహదారిపై రైల్వే ఓవర్ బ్రిడ్జి (ROB) నిర్మాణం పూర్తి చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదే.కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎమ్మెల్యే కళావెంకటరావు గారు,యువనేత రామ మల్లిక్ నాయుడు గారి నిరంతరం పర్యవేక్షించి, కృషి చేయడం వల్లే ఈ వంతెన త్వరితగతిన సిద్ధమైంది.

ఈ నెల 10న ప్రభుత్వం దీనిని అధికారికంగా ప్రారంభించాల్సి ఉండగా, తక్కువ కాలంలో క్రెడిట్ కొట్టేయాలని వైసీపీ నేతలు అనధికారికంగా ప్రారంభించడం వారి దివాళాకోరుతనానికి నిదర్శనమని ధ్వజమెత్తారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి