*అభివృద్ధి మీద అయిన, భోగాపురం ఎయిర్ పోర్ట్ మీద అయిన, తోటపల్లి కాలువ కోసం అయిన జిల్లా పరిషత్ ప్రత్యేక సమావేశం పెడదాం ఉమ్మడి జిల్లా కలెక్టర్ లు, అధికారుల మధ్య ఆధారాలతో మాట్లాడుదాం దమ్ముంటే రండి జిల్లా మంత్రులు కు, ఎమ్మెల్యే లకు జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు సవాల్*
చీపురుపల్లి నియోజకవర్గ సీనియర్ నాయుకులు శాసన సభ్యులు కళా వెంకటరావు గారు ఏదైనా ఆరోపణలు చేసినప్పుడు నిబద్దత తో చెయ్యాలని వై యస్ ఆర్ పార్టీ జిల్లా అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు అన్నారు శుక్రవారం చీపురుపల్లిలో స్థానిక వై యస్ ఆర్ పార్టీ కార్యాలయములో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసారు, ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ వై యస్ ఆర్ పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశములో మా నాయుకులు బొత్స సత్యనారాయణ మాట్లాడిన మాటలను శాసన సభ్యులు సీనియర్ నాయుకులు అన్ని తెలిసిన వారు కళా వెంకటరావు గారు వక్రీకరిస్తూ మాటల్లో నిబద్దత లేకుండా మాట్లాడుతున్నారు అని ఉపాధి హామీ పథకములో అధికార యంత్రాంగం అండదండలతో ఉపాధి హామీపనులను అవినీతి మయం చేస్తున్నారని మా నాయకులు సత్తిబాబు గారు ఆరోపణలు చేస్తే మీరు దానికి స్పందించి అధికార యంత్రాంగము అవినీతి మీద దృష్టి పెట్టి విచారణ కోరకుండా, ఉపాధి హామీ పథకములో ఫీల్డ్ అసిస్టెంట్లు దొంగ మస్తరులు వేసి డబ్బులు దోచుకున్నారు అని మా మాజీ మంత్రిగారు అన్నట్టుగా ఆరోపణలు చెయ్యడం ఎంతవరకు సమంజసం అని అన్నారు, ఉపాధి పనులను నిర్వీర్యం చేశామని చెప్పలేదు మీకు చేతనైతే ఉపాధిలో ఎంతవరకు అవినీతి అవకతవకలు జరుగుతున్నాయని అధికారులు ను నిలదీయండి, విజయనగరం మండలంలో జరిగిన ఉపాధి అవినీతి మీద విచారణ జరిపించండి అని అన్నారు, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారికి నియోజకవర్గంలో ఏది ఎక్కడ ఉందొ మీకు పూర్తిగా అవగాహనలేదు, మీరు బొత్స సత్యనారాయణ గారికి కి దావోస్ ఎక్కడ ఉందొ తెలియదు అంటున్నారు, మీరు పెన్షన్ ల మంత్రిగా 18 నెలలుగా విజయనగరం జిల్లాకు కానీ, మీ సోంతురు లో కానీ అర్హులు అయిన 60 సవత్సరాలు దాటిన అవ్వా తాతలకు ఒక్కరికి పెన్షన్ ఇవ్వగలిగారా, భర్తలు చనిపోయిన ఒక్క వితంతువు కు అయిన పెన్షన్ ఇవ్వగలిగార చెప్పండి, మీ నియోజకవర్గం లో భీమసింగిలో యూరియా దొంగదారిలో మీ నాయకులు వెహికల్స్ మీద తీసుకొని బ్లాక్ మార్కెట్ లో అమ్మడానికి తీసుకొని వెళుతుంటే రైతులు అడ్డుకున్న పరిస్థితి వాస్తవం కాదా, మీరు గత మీ ప్రభుత్వం లో గాని ఇప్పుడు గాని ఎంత నిధులు తీసుకొని వచ్చారో ఎంత అభివృద్ధి చేసారో ప్రజలకు చూపించండి బొత్స సత్యనారాయణ ప్రజల మనిషి ప్రజల మధ్యలో ఉండి వారి కష్ట సుఖాల్లో ఉండి వారి అవసరాలు తీర్చే మనిషి,దివంగత మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు, బొత్స సత్యనారాయణ గారు మా ప్రాంత ప్రజలు వలసలు వెళ్ళకూడదని అప్పట్లో ఉపాధి హామీ పథకం తీసుకొని వచ్చి వలసలు వెళ్లకుండా ఉన్న ఊర్లోనే పనులు ఏర్పాటు చేసాము, అదే ఉపాధి పని నేటి వరకు విజయవంతంగా ఉందని అన్నారు, మేము ప్రజల పక్షాన నిరంతరం వారి మధ్యలో ఉండి వారి కష్ట సుఖాల్లో ఉంటాము మీరు ఆరోపణలు మాని ప్రజల ల్లో ఉండి వారి సమస్య తీర్చండి అని మండి పడ్డారు, కరోనా కష్ట కాల సమయములో ప్రజల్లో మా జగన్ ప్రభుత్వం మేమంతా ప్రజల్లో ఉండి వారి నిత్య అవసరాలు తీర్చాము మీరు మీ నాయుకులు హైదరాబాద్ లో వున్నారు మీరు ఇళ్లల్లో ఉన్నారు, మాకు అధికారం ఉన్న లేకపోయినా ప్రజల్లో ఉండి వారి కష్టాల్లో అండగా ఉంటాం అన్నారు, కళావెంకటరావు గారు తోటపల్లి ప్రాజెక్టు మీ చంద్రబాబు ముఖ్య మంత్రి గా ఉన్నప్పుడు 36కోట్ల జి ఓ ఇచ్చి ఇటుక వేసి శంకుస్థాపన చేసి వెళ్లిపోయారు అదే తోటపల్లి ప్రాజెక్టు ను వై యస్ రాజ శేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి పూర్తి చేసారని గుర్తు చేసారు ఆ ప్రాజెక్ట్ కి సర్ధార్ గౌతు లచ్చన్నపేరు నామ కరణo కూడా చేసారు, అదే కాదు జిల్లాలో అన్ని ప్రాజెక్టు లు మేమే పూర్తి చేశాం అని అన్నారు, నిజంగా మీకు చేతనైతే గరివిడి మండలం కొండలక్ష్మీపురం గ్రామానికి సంవత్సరం క్రితం మంజూరు అయిన ఆర్. ఓ. బి. ని పూర్తి చెయ్యండి, మేముకూడా మీరు చేసారని ఒప్పుకుంటాం అన్నారు, బోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కూడా మా హయమములో అనుమతులు, భూసేకరణ చేసాము, తారకరామ ప్రాజెక్ట్ నుంచి నీరు కోసo నిధులు నిధులు విడుదల చేసాము,కోర్ట్ కేసులు క్లియర్ చేసి జి. యమ్. ఆర్. సంస్థతో ఒప్పందం అప్పటి ముఖ్యమంత్రి జగన్ చేసుకొని శంకుస్థాపన చేసి 50 శాతం పనులు పూర్తిచేసాo చివరిలో మీ కూటమి ప్రభుత్వం వచ్చి మేమే చేసాము అని క్రెడిట్ చోరీ చేస్తున్నారు, జిల్లాలో మీరు ఎక్కడ ఏ అభివృద్ధి చేసారు రండి మేము చేసిన అభివృద్ధి మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలకోసం మాట్లాడుదాం అంటే ప్రత్యేకంగా జిల్లా పరిషత్ మీటింగ్ పెట్టిస్తాను, ఉమ్మడి జిల్లా కలెక్టర్ లు, అధికారులు అందరూ వుంటారు మంత్రులు, ఎమ్మెల్యే లు అందరూ రండి భోగాపురం ఎయిర్ పోర్ట్ మీద అయిన, తోటపల్లి, తారకరామా తీర్ధ సాగర్ కోసం అయిన ఏ అభివృద్ధి కార్యక్రమం కోసం అయిన చర్చిద్దాం ప్రజల కు వాస్తవాలు తెలుస్తాయి, ఎవరు ఎంత అభివృద్ధి చేసారో ప్రజలే చెపుతారు,అని అన్నారు
ఈ కార్యక్రమంలో జిల్లా వైస్సార్ పార్టీ జనరల్ సెక్రటరీ ఇప్పిలి అనంత్, జిల్లా పబ్లిసిటీ వింగ్ అధ్యక్షులు వలిరెడ్డి శ్రీనివాసనాయుడు, మండల వైస్సార్ పార్టీ అధ్యక్షులు మీసాల వరహాలనాయుడు, నియోజకవర్గం యూత్ అధ్యక్షులు బెల్లన వంశీ, వైస్సార్ పార్టీ నాయకులు ధన్నాన జనార్దన్, పతివాడ రాజారావు, మీసాల విశ్వేశ్వర రావు, వలిరెడ్డి లక్ష్మణరావు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.











