జగన్ – బొత్సలకు చెంపపెట్టు: అభివృద్ధి నిరోధకులకు కాలం చెల్లింది

జగన్ – బొత్సలకు చెంపపెట్టు: అభివృద్ధి నిరోధకులకు కాలం చెల్లింది

విజయనగరం జిల్లా,  

చీపురుపల్లి నియోజకవర్గం చీపురుపల్లి టీడీపీ పార్టీ కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో కళావెంకటరావు మాట్లాడుతూ,

జగన్ – బొత్సలకు చెంపపెట్టు: అభివృద్ధి నిరోధకులకు కాలం చెల్లింది!

అభివృద్ధిని అడ్డుకుంటే దేశం నుంచి తరిమికొట్టాలి: మాజీ మంత్రి, ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు హెచ్చరిక

చీపురుపల్లి: రాష్ట్రం ఇప్పుడిప్పుడే అభివృద్ధి పథంలో పరుగులు తీస్తుంటే, ఓర్వలేక విషం చిమ్ముతున్న జగన్ రెడ్డి, బొత్స సత్యనారాయణలకు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు, చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు గారు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైకాపా నేతల తీరుపై నిప్పులు చెరిగారు.

ఏపీ అభివృద్ధిని అడ్డుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్న జగన్ పద్ధతి చూస్తుంటే.. జగన్ కంటే నక్సలైట్లు మేలు అనే పరిస్థితి వచ్చిందని కళావెంకటరావు గారు మండిపడ్డారు. దేశ ద్రోహం, రాజ్యద్రోహం కేసుల కింద జగన్‌ను ఈ దేశం నుంచే తరిమికొట్టాలని ఆయన డిమాండ్ చేశారు. అరాచక శక్తులకు కేరాఫ్ అడ్రస్ వైకాపా అని మరోసారి స్పష్టమైంది.

ఉత్తరాంధ్ర అభివృద్ధి – లోకేష్ మార్క్!
ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారధ్యంలో, ఐటీ మంత్రి నారా లోకేష్ గారు ఉత్తరాంధ్ర ముఖచిత్రాన్ని మార్చేలా పెట్టుబడులు, పరిశ్రమలు తీసుకువస్తుంటే.. ఈ ప్రాంత వాసిగా గర్వపడాల్సింది పోయి, తప్పుడు ఆరోపణలు చేయడం బొత్స సత్యనారాయణ సిగ్గుమాలిన చర్య అని ధ్వజమెత్తారు.

పీపీపీ అంటే ‘ప్రజల కోసం’.. మీలా ‘పేదల దోపిడీ’ కాదు

పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం, విద్య అందించడానికి ప్రభుత్వం పీపీపీ విధానాన్ని తెస్తే, దాన్ని కూడా అడ్డుకుంటామనడం జగన్ అరాచకత్వానికి నిదర్శనం. గత ఐదేళ్లుగా రాష్ట్రాన్ని లూటీ చేసిన జగన్ రెడ్డికి, అభివృద్ధి అంటే భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు.

జగన్ నీ బెదిరింపులకు భయపడే వారు ఎవరూ లేరు

మళ్ళీ వస్తే కేసులు పెడతాం.. అధికారులను వదల బొమ్మాలి అంటూ జగన్ చేస్తున్న వ్యాఖ్యలు ఆయన అజ్ఞానానికి పరాకాష్ట. అధికారం పోయినా అహంకారం తగ్గలేదని, ప్రజలు 11 సీట్లకు పరిమితం చేసినా బుద్ధి రాలేదని కళావెంకటరావు గారు విమర్శించారు.

పెట్టుబడిదారులను బెదిరిస్తూ రాష్ట్ర భవిష్యత్తుతో ఆడుకుంటే ప్రజలే మీకు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి