ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు తిరిగి ప్రారంభం కాగా ఈరోజు చీపురుపల్లి బాయ్స్ హైస్కూల్ లో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కింద టిడిపి యువనాయకులు,రాష్ట్ర కార్యదర్శి శ్రీ కిమిడి రామ మల్లిక్ నాయుడు గారి చేతులు మీదగా పాఠశాలలో ఐరన్, పోషకాలతో కూడిన సన్నబియ్యం పేకెట్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా రామ మల్లిక్ నాయుడు గారు మాట్లాడుతూ..రాష్ట్రవ్యాప్తంగా నాణ్యమైన ఆహారం అందించాలనే లక్ష్యంతో ఎన్డీయే ప్రభుత్వంలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో,విద్యా శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారి సూచనలతో ప్రభుత్వ పాఠశాలల్లో సన్నబియ్యం కార్యక్రమం చేపట్టడం జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో ఎన్డీయే కూటమి నాయకులు,పాఠశాల ప్రిన్సిపాల్ తదితరులు పాల్గొని విద్యార్థులను ఆశీర్వదించి, ప్రభుత్వ విద్యను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తున్న ఈ చర్యల్ని ప్రశంసించారు.



