*ఆంధ్ర విశ్వవిద్యాలయం డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ స్టడీస్* నుంచి *మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీ (ఎం.ఫిల్)* పూర్తి చేసి ఇటీవల ఏయు వేదికగా జరిగినా 91,92వ స్నాతకోత్సవంలో *ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్, ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జి.పి. రాజశేఖర్* చేతుల మీదుగా ఎం.ఫిల్ పట్టాను అందుకున్న *విజయనగరం జిల్లాకు చెందిన చీపురుపల్లి పట్టణవాసి కోట్ల కృష్ణ కు* పలువురు అభినందనలు తెలిపారు. డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ స్టడీస్ ఆచార్యుడు *డాక్టర్ కె.వి రమణమూర్తి* పర్యవేక్షణలో “*ఏ స్టడీ ఆన్ ఎన్ అప్రైజల్ ఆఫ్ హౌసింగ్ ఫైనాన్స్ స్కీమ్స్ విత్ రిఫరెన్స్ టు పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్ ఇన్ విశాఖపట్నం డిస్ట్రిక్ట్ ఆంధ్ర ప్రదేశ్* ” అనే అంశంపై చేసిన పరిశోధనకు గాను ఆయనకు ఏయూ నుంచి ఈ ఎం.ఫిల్ పట్టాను అందజేసింది. ఈ సందర్భంగా  ప్రిన్సిపల్ ప్రొఫెసర్ జాలాది రవి, ఫ్యాకల్టీ ఆఫ్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ చైర్మన్ ప్రొఫెసర్ పి. అరుణ్ కుమార్, బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్ ప్రొఫెసర్ పి. వెంకటేశ్వర్లు, విభాగాధిపతి ప్రొఫెసర్ ఎం. ఉమాదేవి, ఆచార్యులతోపాటు, నాన్స్ టీచింగ్ స్టాఫ్ మరియు ఏయూ పరిశోధకులు అభినందించారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి