దశాబ్దాలుగా తీరని సమస్య (కుడుమూరు)

దశాబ్దాలుగా తీరని సమస్య (కుడుమూరు)

కుడుమూరు 48 సర్వేనెంబర్ 782 ఎకరాల ప్రభుత్వ భూమిని తరతరాలుగాసాగు చేస్తున్న గిరిజనులకు పంపిణీ చేయాలని ఆదివాసి గిరిజన సంఘం ,వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ ఎమ్మార్వో కార్యాలయం వద్ద బయట ఇంపు జరిగింది కుడుమూరు భూపారాట కమిటీ కన్వీనర్ అప్పలస్వామి ఆదివాసి గిరిజన సంఘం జిల్లా కమిటీ సభ్యులు జన్ని రామయ్య, మంచాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి కొల్లి గంగు నాయుడు గారు మాట్లాడుతూ తాతల కాలం నుండి సాగు చేస్తున్నటువంటి ఈ భూములకు నేటి వరకు పట్టాలు మంజూరు చేయకపోవడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు గత ప్రభుత్వం హయాంలో ఎమ్మెల్సీగా ఉన్నటువంటి మంత్రి సంధ్యారాణి గారు నేను ఎమ్మెల్యే అయితే మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే తప్పనిసరిగా కుడుమూరు భూములకు పట్టాల మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని కుడుమూరు భూ పోరాట కమిటీ గ్రామాలన్నీ తిరిగి చెప్పడం జరిగిందనీ నేడు ఇచ్చిన మాట తప్పకుండా అమలు చేసి పట్టాలు మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు కుడుమూరు 48 సర్వేనెంబర్ భూములను కబ్జా చేయాలని కొంతమంది పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నారనీ వారికి కొంతమంది అధికారులు సహకరిస్తున్నారని  కాలయాపన చేస్తూ సాగు చేస్తున్నటువంటి భూములకు పట్టాలు ఇవ్వకపోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు . సర్వే నంబర్ 48 లో ఉన్న 782 ఎకరాలుప్రభుత్వ భూమి అని రెవిన్యూ అధికారులు తేల్చినప్పటికీ గత ప్రభుత్వ హయాంలో సర్వే చేసిన వివరాలు ఎందుకు బహిర్గతం చేయలేదని విమర్శించారు సాగు పట్టాలు పంపిణీ చేయకపోతే భవిష్యత్ పోరాటానికి పరిణామాలు కి ప్రభుత్వం అధికారులే బాధ్యత పడాలని హెచ్చరించారు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎన్ వై.నాయుడు మాట్లాడుతూ గిరిజన భూములను సక్రమంగా సకాలంలో వారికి పట్టాలు మంజూరు చేయకపోవడం వలన ఆ భూములు అన్యాక్రాంతమవుతున్నాయని ఎప్పటికీ పోరాటాలు చేసిన వాటి గురించి పట్టించుకోక పోవవడం సరైన పద్ధతి కాదని రాజ్యాంగాన్ని ఉల్లంఘించే విధంగా అధికారులు వ్యవహరించడం సరైనది కాదని ఎప్పటికైనా వారు చేస్తున్నటువంటి న్యాయమైన పోరాటాన్ని గుర్తించి నిజమైనటువంటి సాగులో ఉన్న  గిరిజనులందరికి న్యాయం చేయాలని లేదంటే ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని అన్నారు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి మర్రి శ్రీనివాసరావు మాట్లాడుతూ దశాబ్ద కాలంగా పోరాటాలు చేస్తున్న నేటి వరకు పట్టించుకోకపోవడం ఈ భూములను ఎవరు అప్పచెప్పాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రజా సంఘాలు సిపిఎం పార్టీ పోరాటాల ఫలితంగా ప్రభుత్వాలు సర్వేలు చేశారని ఆ సర్వే వివరాలు నేటికీ పంపిణీ చేయకపోవడం ఆ పేర్లను బహిర్గతం చేయకపోవడం వెనక ఉన్న ఉద్దేశం ఏమిటని అడిగారు      ఈ కార్యక్రమంలో       సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కోరాడ ఈశ్వరరావు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ రెవిన్యూ అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి వెంటనే పట్టాలు మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ గిరిజనులంతా ఐక్యంగా భూమి హక్కులు సాధించేవరకు ఏకతాటిపై నిలబడి సాధించుకోవాలని గతంలో కొండ తాడూరు భూములను కూడా 113 సర్వేనెంబర్ 210 ఎకరాలు ప్రభుత్వ భూమి అధికారులు తేల్చే వరకు మన పోరాటం విజయమని అదే విధంగా ఈ భూములు పోరాటాన్ని కూడా ముందుకు తీసుకెళ్లి విజయం సాధించేవరకు ఉద్యమించాలని కోరారు ఈ కార్యక్రమంలో కుడుమూరు భూపారాట కమిటీ నాయకులు కొర్ర కళ్యాణ్ శ్రీనివాసరావు సుర్రు గంగయ్య సుర్రు రామారావు ఎర్రయ్య కారంగి అప్పారావు వేటూరి చిన్నారావు రామయ్య గేమ్మేళ గోపాల్, సొయ్యారి సోమయ్య్, అప్పయ్య తదితరులు పాల్గొన్నారు

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి