జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్ ఆదేశాలతో దేవాలయాలవద్ద సిసి కెమెరాలు, డ్రోన్ లతో భక్తుల రద్దీని పర్యవేక్క్షిస్తూ ఎప్పటికప్పుడు భక్తులకు, ప్రజలకు సూచనలు చేస్తున్నా జిల్లా పోలీసు యంత్రాంగం*
మహాశివరాత్రి ఉత్సవాలలో నేరాలను, ఈవ్ టీజింగు, అసాంఘిక కార్యకలాపాలను, చైన్ స్నాచింగ్స్ నియంత్రించుటకు ప్రత్యేక బృందాలను నియమించి ప్రజలకు భరోసా కల్పిస్తున్న జిల్లా పోలీసులు*
జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ ఆదేశాలతో భక్తులు సులభతరంగా మహాశివుడిని దర్శించుకొనే విధంగా చర్యలు చేపట్టిన పోలీసు యంత్రాంగం*
విజయనగరం జిల్లాలో రామతీర్థం, పుణ్యగిరి మరియు సంగంతో పాటు జిల్లా వ్యాప్తంగా పలు శివాలయాల వద్ద భక్తులకు ఫిబ్రవరి 15న ఎటువంటి ఇబ్బంది కలగకుండా, ఎక్కడా అవాంచనీయ సంఘటనలు జరగకుండా చేపట్టిన ముందస్తు చర్యలు, పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు వలన మహాశివరాత్రి జాతర మహోత్సవాలు ప్రశాంతంగా కొనసాగుతున్నట్టు జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ మాట్లాడుతూ – మహాశివరాత్రి జాతర మహోత్సవాలులో భక్తులు సులభతరంగా శివుడిని దర్శించుకొనే విధంగా క్యూలైన్లను ఏర్పాటు చేయడం, త్వరితగతిన భక్తులను వరుస క్రమంలో పంపేటట్లు బందోబస్తు నిర్వహించడం, భక్తుల రద్దీని, వాహనాల రాకపోకలను సిసి కెమెరాలు, డ్రోన్ లతో నిరంతరం పర్యవేక్షిస్తూ, సందర్భానుసారంగా రద్దీని నియంత్రిస్తున్నామని జిల్లా ఎస్పీ తెలిపారు. సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా మొత్తం సుమారు 1000మంది పోలీసులతో భద్రత ఏర్పాట్లు చేపట్టడం సత్ఫలితాలిస్తున్నాయన్నారు. వాహనాల పార్కింగుకు ప్రత్యేకంగా స్థలాలు కేటాయించడంతో ఆలయ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీని నియంత్రించగలుగుతున్నామన్నారు. పండగ రోజుల్లో నిర్వహించే సాంస్కతిక కార్యక్రమాలు, ఎగ్జిబిషను, ఆలయ పరిసరాల వద్ద ఎటువంటి జేబు దొంగతనాలు, చైన్ స్నాచింగ్స్ జరగకుండా మఫ్టీలో పోలీసులు నియమించడం, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సిసి కెమెరాలను, డ్రోన్స్ ను నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రజలు మరియు భక్తుల మన్ననలు పొందుతున్నారని తెలిపారు. మహాశివుడిని దర్శించేందుకు విచ్చేసిన వృద్ధులు, గర్భిణిలు, దివ్యాంగులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అవసరమైన సహాయ, సహకారాలను విజయనగరం జిల్లా పోలీసులు సేవాదళ్ పేరుతొ సేవలందిస్తున్నారని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ తెలిపారు.









