స్థానిక పశువైద్య కళాశాల ప్రాంగణంలో ఈరోజు ఉదయం నిర్వహించిన మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాలను ఘనంగా ఇంచార్జ్ అసోసియేటె డీన్, డాక్టర్ టి ప్రసాద్ రావు గారు దగ్గరుండి జరిపించారు. జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైన ఈ కార్యక్రమం మహాత్మ జ్యోతిరావు పూలే చిత్రపటానికి ముఖ్యంగా విద్యార్థుల చేత పూల మాలతో అలంకరించారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా విచ్చేసిన ఉపాధ్యాయులు, మిరియాల కృష్ణారావు గారు కార్యక్రమంలో యువత కు “సామాజిక బాధ్యత” పట్ల అవగాహన కల్పించడంతోపాటు జ్యోతిరావు పూలే ఆశయాలకు, పశు వైద్య విద్యార్థులు ఆశయంగా నిలవాలని విద్యార్థులను కొనియాడారు. అనంతరము పలు అంశాలపై వ్యాసరచన, మరియు వాక్చాతుర్యం పోటీలలో విజయం పొందిన పిల్లలకు నగదు మరియు ప్రోత్సాహక బహుమతులను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో Y సాయి శంకర్ (రెండవ సంవత్సర పశువైద్య విద్యార్థి) కు ప్రథమ స్థానం, P లలిత కుమారీ (మూడవ సంవత్సర పశు వైద్య విద్యార్థి) కి ద్వితీయ స్థానము మరియు A సందీప్ (రెండవ సంవత్సర పశు వైద్య విద్యార్థి) లకు నగదు బహుమతులను బహుకరించారు. ఈ కార్యక్రమంలో ఇంటర్షిప్ అధికారి డాక్టర్ బి ప్రకాష్ కుమార్ సెక్యూరిటీ అండ్ లైసెన్ ఆఫీసర్ డాక్టర్ ఎస్ గంగు నాయుడు కళాశాల అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ బి గిరీష్ కుమార్ మరియు అధిక సంఖ్యలో విద్యార్థులు అధ్యాపక మరియు అధ్యాపకేతర సిబ్బంది పాల్గొని, కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. Spread the love టపా నావిగేషన్ రెండు తులాల కోసం వృద్ధురాలు హత్య