దేశానికి స్వాతంత్ర్యం రావడానికి గాంధీజీ నిస్వార్ధంగా సేవలందించారని చీపురుపల్లి శాసనసభ్యులు గౌరవ శ్రీ కిమిడి కళావెంకటరావు గారు అన్నారు.
నేడు గాంధీ జయంతి సందర్భంగా రాజాం తమ నివాస కార్యాలయంలో గాంధీ మహాత్ముని చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కళావెంకటరావు గారు మాట్లాడుతూ భారత స్వాతంత్ర్యం కోసం మహాత్మా గాంధీ గారు అహింస వాదంతో ముందుకు వెళ్లి మనకు స్వాతంత్రాన్ని సాధించారని అన్నారు.
బ్రిటిష్ వారు ఎన్ని ఇబ్బందులు పెట్టిన అహింసా సిద్ధాంతంతోనే ముందుకు వెళ్లారని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో టిడిపి కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.