మక్కువ మండలం కాశీపట్నం పంచాయతీలో  టీడీపీ, జనసేన, ఎన్డీయే కూటమి అభ్యర్థి శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి   ప్రచారం చేసి, కరపత్రాలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా సంధ్యారాణి గారు మాట్లాడుతూ, పెన్షన్ డబ్బులను ఈ వైసీపీ ప్రభుత్వం సొంత కాంట్రాక్టర్ లకు చెల్లించి, పెన్షన్లు ఇవ్వటానికి డబ్బులు లేక ప్రతిపక్షాలపై బురద జల్లుతుందని, వాలంటీర్లును, ఉద్యోగస్తులుగా కాకుండా సొంత కార్యకర్తల లాగా ఉపయోగీస్తూ అక్కడక్కడ వృద్ధులు చనిపోతే టీడీపీ వాళ్ళవలన చనిపోయారని నాటకాలుఆడుతుందని, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి అభివృద్ధి జరగలేదని, నిత్యావసర వస్తువుల ధరలు పెంచి సామాన్యుల నడ్డి విరిచిందని తెలిపారు. మీ మక్కువ మండల ఆడపిల్లగా నన్ను అభిమానించి, సైకిల్ గుర్తుపై ఓటు వేసి, అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు గుల్ల వేణుగోపాల్ నాయుడు , గ్రామ నాయకులు అల్లు అప్పలనాయుడు , అమరాపు సింహాచలం, బొంగు వాసుదేవరావు, తవితనాయుడు, గొంగాడ భూషణ్, బుడిసెట్టి గౌరీ, మింది సింహాచలం, మింది శ్రీను, మచ్చ భాస్కరరావు, అక్కేన తిరుపతి, అఖ్యాన మన్మధ, రెడ్డి రమణ, కేశవ, స్వామి నాయుడు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *