భగత్ సింగ్ జయంతి సందర్భంగా మెగా రక్తదాన శిబిరం

భగత్ సింగ్ జయంతి సందర్భంగా మెగా రక్తదాన శిబిరం

రక్తదానంతో ఎంతో మంది ప్రాణాలు కాపాడువచ్చని మీకై..మేము వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు దిలీప్ కుమార్ తెలిపారు.. సాలూరు పట్టణంలో భగత్ సింగ్ జయంతి సందర్భంగా మెగా రక్తదాన శిబిరాన్ని మీకై..మేము వెల్ఫేర్ అసోసియేషన్ మరియు శ్రీ గౌరమ్మ చారిటబుల్ ట్రస్ట్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మరో పునర్జన్మ అని కొనియాడారు.ఈ రక్త సేకరణ అనేది గర్భిణీ స్త్రీలకు,తల సేమియా, సికిల్స్ సేమియా, ప్రమాదంలో గాయపడిన వారికి, వివిధ రకాల వారికి ఈ రక్తనిధి సేకరణ చేయడం జరుగుతుందని అన్నారు. అంతేకాకుండా ఎంతోమంది రక్తదానం చేయడానికి ముందుకు రావడం లేదని యువతి,యువకులు అలాంటి అపోహలు పోవద్దని రక్త దానం చేయడం కొత్త రక్త కణాలు ఏర్పడతాయి.మన ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని తెలియజేశారు. సుమారుగా 35 మంది రక్త నిధి సేకరణ చేయడం జరిగింది. ఈ రక్తం విజయనగరం ఎన్.వి.ఎన్ బ్లడ్ బ్యాంక్ వారికి అందజేయడం జరుగుతుంది అన్నారు. ఈ కార్యక్రమానికి నవోదయ యువ సేవాసమితి వారు సహకరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో గౌడు ఈశ్వరరావు,పంచాది శ్రీనివాసరావు,వంక మనోజ్, పసుమర్తి నరేష్ కుమార్, అక్కేనే సన్యాసిరావు, గుల్లిపల్లి రాజగోపాల్,

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి