*జిల్లా పరిషత్ ఉన్నత బాలుర, బాలికల మరియు కేజీబీవీ పాఠశాలలో మెగా పిటిఎమ్ 3.O సమావేశంలో పాల్గొన్న జనసేన జిల్లా కో-ఆర్డినేటర్ కోట్ల కృష్ణ*
చీపురుపల్లి పట్టణంలో స్థానికంగా ఉన్న జిల్లా పరిషత్ బాలుర, బాలికల మరియు కేజీబీవీ పాఠశాలలో తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం (మెగా పి టి ఎమ్ 3.O) కార్యక్రమంలో పాల్గొన్న జనసేన ఉమ్మడి విజయనగరం జిల్లా కో- ఆర్డినేటర్ రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యులు కోట్ల కృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయులు అర్థమయ్యేలా విద్యార్థులకు బోధించాలని సూచించారు. తల్లిదండ్రులు కూడా పాఠశాల అనంతరం విద్యార్థులను ఇంటి వద్దనే ఉంచి తరగతి గదిలో చెప్పిన పాఠాలను రివిజన్ చేసేలా చూడాలని సూచించారు, పాఠశాల ఆవరణను పరిశీలించిన అనంతరం యోగా మరియు క్రీడలకు సంబంధించిన క్రీడా మైదాన ప్రాంగణ ఏర్పాటుకు స్థలం కేటాయించేందుకు స్థానిక శాసనసభ్యులు శ్రీ కిమిడి కళా వెంకట్రావు గారి దృష్టికి తీసుకువెళ్లి వీలైనంత త్వరలో మంజూరు అయ్యేలా చేస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థులకు నైతిక విలువలతో కూడిన విద్యను అందించాలని రుచితో పౌష్టిక ఆహారాన్ని కూడా అందించాలని,పాఠశాల అంటే కేవలం నాలుగు గోడల మధ్య ఉండే భవనం కాదని ఇది ఒక జ్ఞాన దేవాలయం అని ఇక్కడ నేర్చుకునే ప్రతి అక్షరం కూడా మీ జీవితానికి వేసే పటిష్టమైన పునాదని కొనియాడుతూ ఈ చదువు అనే ఆయుధంతోనే ప్రపంచాన్ని జయించగలమని
జీవితంలో సవాళ్లు సహజమని పరీక్షలు కష్టంగా అనిపించవచ్చు, కొన్ని సబ్జెక్టులు అర్థం కాకపోవచ్చు కానీ వజ్రం సానబెడితేనే మెరుస్తుంది, బంగారం అగ్నిలో కాలిస్తేనే స్వచ్ఛత సంతరించుకుంటుంది, అలానే మన జీవితంలో ఎన్నో కష్టాలు, సవాళ్లును ఎదుర్కోవడానికి దృఢంగా, తెలివిగా మనల్ని మారుస్తాయని. మనం నిత్యజీవితంలో చదువుకునే పాఠ్యాంశాలలో కొంతమంది మహోన్నత వ్యక్తుల గురించి చదువుకుంటూ ఉంటామని ఉదాహరణకు
డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు అన్నారు, “కలలు కనండి, ఆ కలలను సాకారం చేసుకోవడానికి కృషి చేయండి” అని. అలాగే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఒక ఉపాధ్యాయునిగా ఉండి నైతిక విలువలతో కూడిన విద్యను బోధించి భారత దేశ రెండో రాష్ట్రపతి అయ్యారటే కారణం ఆయన నడవడికలో నిజాయితీ, క్రమశిక్షణ, త్యాగం, ఓర్పు, గౌరవం,కరుణ, సానుభూతి వంటి నైతిక విలువలను విద్యార్థులకు బోధించడం వలన, మనలో కూడా అలాంటి మహనీయులు బోధించిన విలువలను అలవర్చుకున్నప్పుడు గొప్ప వ్యక్తులు జాబితాలోకి ప్రతి విద్యార్థి కూడా వెళ్తారని కొనియాడుతూ, విద్యార్థులు క్రమశిక్షణతో బాగా చదువుకొని వివిధ రంగాల్లో రాణించి భారత దేశ ఉనికి ప్రపంచ నలుమూలల చాటాలని, ఈ మహోత్తరమైన కార్యక్రమాన్ని చేపడుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌ. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు గౌ. శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు గౌ. నారా లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలియజేసిన అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడారు. పాఠశాల పరిసర ప్రాంతాలు మరియు తరగతి గదులు వసతి గదులను పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్య కమిటీ చైర్మన్లు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ప్రజా ప్రతినిధులు, మండల అధికారులు
మరియు సిబ్బంది, విద్యార్థి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.






