జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం మరియు ప్రమాద బీమా నమోదు కార్యక్రమంలో భాగంగా సాలూరు నియోజకవర్గం 9వ వార్డు లో భాగం అయిన మహంతి వీధి నందు చాలా ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన కార్యకర్తలు అభిమానులు మరియు పవన్ కళ్యాణ్ రాజకీయం గారి చతురత కు ఆకర్షితులైన ప్రజలు జనసేన పార్టీకి లో చేరేందుకు మక్కువ చూపడం చాలా శుభప్రదం. రాజకీయాలకు దూరంగా ఉండే కొంతమంది ప్రజలకు కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో భయం లేకుండా రాష్ట్రానికి మేలు కూరే విధంగా పవన్ కళ్యాణ్ గారి నిర్ణయాలు ఉన్నాయని ఈ సందర్భంగా కొనియాడారు. పవన్ కళ్యాణ్ గారు లాంటి రాజకీయనేతలు ఈ రాష్ట్రానికి చాలా అవసరం అని, వారి దారిలో నడిచే జనసైనికులు మరింత అవసరమని ఈ సందర్భంగా ప్రశంసలు కురిపించారు. గత సంవత్సరం సభ్యత్వాలకు తో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఇప్పటివరకు 1500 దాటి నూతన సభ్యత్వాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమం వార్డులో బాధ్యత వహిస్తూ మీసాల సతీష్ గారు ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో సాలూరు మండలం ప్రెసిడెంట్ మరియు ముఖ్య నాయకుడు కురుహూరు శివ గారు, మీసాల నవీన్, రవి, సాయి, మురళి, చంటి తదితరులు పాల్గొన్నారు.