మన్యం జిల్లా సాలూరు మండలం కొత్తవలస గ్రామంలో ‘సూర్యాఘర్’ కార్యక్రమాన్ని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ప్రారంభించారు. సూర్యాఘర్’ పథకం లభించినందుకు ఎస్టీ ప్రజలు ఎంతో ఆనందంతో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి గారి కి ఘన స్వాగతం పలికి, మేళతాళాలతో కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ కార్యక్రమం అమలులో దేశంలోనే ముందంజలో ఉందని మంత్రి తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం సుమారు 6 లక్షల ఎస్సీ / ఎస్టీ కుటుంబాలకు 2 కిలోవాట్ సామర్థ్యం గల సోలార్ సిస్టమ్‌లను ఉచితంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు అని మంత్రి తేలిపారు ఈ పథకం ద్వారా పేద కుటుంబాలపై ఉన్న విద్యుత్ ఖర్చు భారాన్ని తగ్గించడం ప్రధాన లక్ష్యం అని మంత్రి పేర్కొన్నారు.అదేవిధంగా, ఈ సోలార్ సిస్టమ్‌ల నిర్వహణ కోసం ప్రతి నెల మెంటెనెన్స్ చార్జ్‌ను కూడా ప్రభుత్వం అందిస్తుంది అని మంత్రి వెల్లడించారు. కొత్తవలస గ్రామంలో 36 ఇళ్లకు ‘సూర్యాఘర్’ పథకం అందిస్తున్నాము అని మంత్రి తెలిపారు.అలాగే సాలూరు నియోజకవర్గం పరిధిలో మొత్తం 4300 ఇళ్లకు ‘సూర్యాఘర్’ పథకాన్ని అందించనున్నాము అని మంత్రి స్పష్టం చేశారు.మన్యం జిల్లా లో సుమారు 14100 సోలార్ యూనిట్లు ఏర్పాటు చేసి ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు.అలాగే ప్రతి నియోజకవర్గంలో సుమారుగా పదివేలకు పైగా సోలార్ యూనిట్లను ఏర్పాటు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు Spread the love టపా నావిగేషన్ మానవత్వానికి నిలువెత్తు రూపం.. మన కలెక్టర్*