నీటి భద్రత – సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి

ఈరోజు సాలూరు తహసీల్దార్ కార్యాలయంలో నీటి భద్రత – సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమంలో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి  పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రైతుల సంక్షేమం, సాగునీటి వినియోగం మరియు అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులు, రైతులతో కలిసి సమీక్ష నిర్వహించారు.

ఈ కార్యక్రమం 06-04-2026 నుండి 14-07-2026 వరకు నిర్వహించబడుతుంది.

మొత్తం 100 రోజుల ప్రత్యేక కార్యక్రమంగా ప్రభుత్వం చేపట్టింది.

ఈ 100 రోజులలో సాగునీటి పనులను గుర్తించడం, నిధులు మంజూరు చేయడం, పనులను వేగంగా పూర్తి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి తెలిపారు.

రైతులకు సమయానికి సాగునీరు అందేలా అధికారులు సమన్వయంతో పని చేయాలని మంత్రి సూచించారు.

ఈ సంవత్సరానికి సంక్షేమం – అభివృద్ధి కోసం సాలూరు నియోజకవర్గానికి రూ.490 కోట్లు

ప్రభుత్వం ఈ ఏడాది మొత్తం ₹490 కోట్లను వివిధ సంక్షేమ పథకాలకు కేటాయించినట్లు మంత్రి తెలిపారు.
పెన్షన్లకు – ₹187 కోట్లు 

తల్లికి వందనం పథకానికి – ₹52 కోట్లు
అన్నదాత సుఖీభవ – ₹45 కోట్లు 

దీపం – 2 – ₹12 కోట్లు
స్త్రీ శక్తి – ₹9 కోట్లు
ఆటో డ్రైవర్ల సంక్షేమం – ₹2 కోట్లు

ప్రజల సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి చెప్పారు.

విజన్ యాక్షన్ ప్లాన్‌పై మంత్రి వ్యాఖ్యలు

జిల్లాలో అభివృద్ధి కోసం స్పష్టమైన విజన్ యాక్షన్ ప్లాన్ రూపొందించి అమలు చేస్తున్నామని తెలిపారు.

గత ప్రభుత్వం చేసిన అప్పులపై 6% వడ్డీతో ప్రస్తుతం ప్రభుత్వం చెల్లింపులు చేస్తోందని పేర్కొన్నారు.

ఎంత ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజల సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం ఎక్కడా ఆపలేదని మంత్రి స్పష్టం చేశారు.

PGRS ద్వారా వచ్చే ప్రజల సమస్యలను అధికారులు పూర్తి శ్రద్ధతో పరిశీలించి పరిష్కరించాలని ఆదేశించారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి