ఈరోజు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి బాడెవలస మరియు జగన్నాధపురం ముంపు గ్రామాలను సందర్శించి పరిశీలించారు.
ఈ సందర్భంగా ముంపు గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. ప్రజలతో మాట్లాడి వారి ఇబ్బందులను విన్నారు. అధికారులు తక్షణమే చర్యలు తీసుకొని ముంపు ప్రభావిత ప్రజలకు సహాయం అందించాలని ఆదేశాలు ఇచ్చారు.








