తెలుగుదేశం పార్టీ అంటే ప్రాణం ప్రాణం గా భావించి అనుక్షణం తన భుజాలపై తెలుగుదేశం జెండా మోసే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వీర అభిమాని తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్త ఆదాడ సత్తిబాబు గారు అకాల మరణానికి మంత్రివర్యులు శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి గారు సంతాపం తెలిపారు. పార్టీకి, ప్రజలకు ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఈ క్లిష్ట సమయంలో కుటుంబ సభ్యులకు ధైర్యం, శాంతి కలగాలని మంత్రివర్యులు ఆకాంక్షించారు.





 
             
                                         
                                        