చీపురుపల్లి నియోజకవర్గంలో రూ. 3.35 కోట్లతో రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే శ్రీ కిమిడి కళావెంకటరావు.

చీపురుపల్లి నియోజకవర్గంలో రూ. 3.35 కోట్లతో రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే శ్రీ కిమిడి కళావెంకటరావు.



* చీపురుపల్లిలో అభివృద్ధి జాతర రూ. 3.35 కోట్లతో రహదారుల నిర్మాణానికి ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు గారు శంకుస్థాపన.

* విధ్వంసం నుంచి అభివృద్ధి వైపు చీపురుపల్లి ప్రయాణం.. గత పాలకుల నిర్లక్ష్యానికి తెరదించుతూ రహదారుల పునర్నిర్మాణం ఎమ్మెల్యే కళావెంకటరావు గారు.

* మారనున్న నియోజకవర్గ ముఖచిత్రం.. యుద్ధప్రాతిపదికన రోడ్ల పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు గారు

చీపురుపల్లి నియోజకవర్గ అభివృద్ధియే ధ్యేయంగా, కూటమి ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా చీపురుపల్లి ఎమ్మెల్యే, టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు మరియు మాజీ మంత్రివర్యులు శ్రీ కిమిడి కళావెంకటరావు గారు సోమవారం పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.

నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు రవాణా సౌకర్యాలను మెరుగుపరిచే దిశగా మొత్తం రూ. 3.35 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న మూడు ప్రధాన రహదారి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.

శంకుస్థాపన చేసిన పనుల వివరాలు..
* చీపురుపల్లి-లావేరు రోడ్డు నుండి ఎలకలపేట వరకు వయా రావివలస, ఆర్ధివలస మీదుగా నిర్మించే ఈ రహదారికి రూ. 2.00 కోట్లు కేటాయించారు.
* చీపురుపల్లి-లావేరు రోడ్డు నుండి రావివలస రోడ్డు వరకు వయా నాగంపేట, గురన్నపేట మీదుగా నిర్మించే ఈ రోడ్డుకు రూ. 65 లక్షలు వెచ్చించనున్నారు.
* శివరాం-పర్ల రోడ్డు నుండి ఇటకర్లపల్లి రోడ్డు వరకు దీని నిర్మాణానికి రూ. 70 లక్షలు మంజూరయ్యాయి.

ఎమ్మెల్యే శ్రీ కిమిడి కళావెంకటరావు గారు మాట్లాడుతూ..గత ఐదేళ్ల సైకో జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం సర్వనాశనమైంది. కనీసం ఒక తట్టెడు మట్టి వేయలేని దౌర్భాగ్య స్థితిలో గత ప్రభుత్వం ఉండేది. రాష్ట్రమంతా గుంతలమయంగా మారి, అసలు రోడ్లు లేని ఊర్లు దర్శనమిచ్చే పరిస్థితిని జగన్ కల్పించారు.

కూటమి ప్రభుత్వ సంకల్పంతో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అభివృద్ధికి పెద్దపీట వేసింది. పాడుబడిన రహదారులకు పూర్వ వైభవం తీసుకురావడమే మా లక్ష్యం.

నియోజకవర్గ ప్రజల కష్టాలను గుర్తించి, యుద్ధ ప్రాతిపదికన నిధులు మంజూరు చేయించి అభివృద్ధి పనులు మొదలుపెడుతున్నామని, భవిష్యత్తులో చీపురుపల్లిని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే కళావెంకటరావు గారు స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి