ఆటలతో ఒత్తిడి దూరం ఎమ్మెల్యే విజయ్ చంద్రఆటలు ఆడటం వల్ల ఒత్తిడి దూరం అవుతుందని ఎమ్మెల్యే విజయ్ చంద్ర అన్నారు పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో హ్యాపీ సండే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.వారంలో ఒకరోజు ఆటలకు కేటాయించి ఒత్తిడిని దూరం చేయాలన్న ఉద్దేశంతో హ్యాపీ సండే కార్యక్రమాన్ని కూ టమి ప్రభుత్వం రూపొందించిందని ఎమ్మెల్యే వివరించారు ఉద్యోగాలు వ్యాపారాలు వివిధ రకాల పనులతో బిజీగా ఉండే వారంతా ఆదివారం ఓచోట కలిసి ఆటలు ఆడటం వల్ల ఒత్తిడి నుంచి దూరం అయ్యేందుకు అవకాశం ఉంటుందన్నారు ఆరోగ్యానికి మించిన భాగ్యం లేదని పనుల ఒత్తిడి వల్ల వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని వాటిని సమర్థంగా ఎదుర్కొనేందుకు ఆటలు వ్యాయామం దోహదపడతాయన్నారు ప్రతి నెలలో రెండు, నాలుగు ఆదివారాల్లో నిర్వహించే ఈ కార్యక్రమం భవిష్యత్తులో మరింత సందడిగా కొన్ని కొత్త అంశాలతో నిర్వహించుకుందని సూచించారు ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ పావని, సిబ్బంది, టిడిపి నాయకులు, కౌన్సిలర్స్ పాల్గొన్నారు Spread the love టపా నావిగేషన్ అప్రకటిత విద్యుత్ కోతలతో పురవాసులు ఇక్కట్లు పార్వతీపురం మన్యం జిల్లాలో సంఘవిద్రోహ కార్యకలాపాల,అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు కట్టడి