విజయనగరం జిల్లా బొబ్బిలి అంబేద్కర్ విగ్రహం ఆవరణలో ఈరోజు సోర్ సాంబ ఆధ్వర్యంలో మాత సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్ఫూర్తి మహిళ మండలి డైరెక్టర్ బలగరాధ హాజరయ్యారు ముందుగా బలగ రాధా చేతుల మీదుగా సావిత్రిబాయి చిత్రపటాన్ని పూలమాలలతో ఘనంగా సత్కరించడం జరిగినది అనంతరం నిరుపేద దళిత మహిళలకు చీరలు పంపిణీ బలగరాద చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగినది అనంతరం మహిళల అభ్యున్నతి కోసం గిరి సెక్ర గిరిజన మహిళలకు మరియు దళిత మహిళల చైతన్యం కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టి మహిళా పోరాటాలు చేపడుతున్న బలగరాధకు మహిళలంతా ఘన సన్మానం చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సోర్ సాంబ మరియు బలగరాధ మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే జయంతి జరుపుకోవడం మనమంతా అదృష్టంగా భావించాలని ఎందుకంటే మన భారత దేశ మహిళలందరి కోసం ఆమె చేసిన పోరాటం మరువలేనిదని భారతదేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు అంతేకాకుండా ఆమె స్త్రీ చదువుకుంటే ఒక ఇల్లే కాకుండా సమాజం బాగుపడుతుందని స్త్రీ విద్య కోసం ఉద్యమాలు చేసి భారత ఉద్యమ నాయకురాలుగా మరియు క్రాంతి జ్యోతిగా ఒక గొప్ప సంఘసంస్కర్తగా ఆమె మన దేశ మహిళల కోసం ఎన్నో సేవలు అందించారని గొప్ప విషయం ఏంటంటే బ్రిటిష్ ప్రభుత్వము చే ఉత్తమ ఉపాధ్యాయురాలిగా అవార్డు పొందిన ఏకైక మహిళ అని స్త్రీ విద్య కోసం సొంతంగా పాఠశాలలు నిర్మించిన గొప్ప వ్యక్తి సావిత్రిబాయి పూలే అని కావున ఆమె జయంతి జరుపుకోవడమే కాకుండా ఆమె నీ ఎల్లప్పుడూ మహిళలు గుండెల్లో నిలుపుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఏ గోపాల్ రావు వయ్యా ఆనంద్ రావు కే మహేష్ పట్నాయక్ ఎన్ఎస్ గుప్తా ఎన్ఎస్ గుప్తా కేటీ ఆచారి కోటా రవి వీ తవుడు ఎన్ ఈశ్వరరావు బి భాస్కరరావు జె దుర్గారావు జి వెంకట్రావు మరియు మహిళలు పాల్గొన్నారు