Jul 14, 2025,
ఢిల్లీలో యువతి ‘మిస్సింగ్’ మిస్టరీ.. మృతదేహం లభ్యం
త్రిపురకు చెందిన ఓ 19 ఏళ్ల యువతి స్నేహ దేవ్‌నాథ్ ఢిల్లీలో అదృశ్యమైన విషయం తెలిసిందే. గత ఆరు రోజులుగా ఆమె కోసం ముమ్మర గాలింపు చేపట్టారు. చివరకు సిటీలోని యమునా నది ఒడ్డున యువతి మృతదేహం లభ్యమైనట్లు తెలిసింది. మృతదేహాన్ని కుటుంబ సభ్యులు కూడా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. జులై 7న ఢిల్లీలోని సిగ్నేచర్ బ్రిడ్జ్ వద్దకు క్యాబ్‌లో వెళ్లిన ఆమె.. అప్పటి నుంచి కనిపించకుండా పోయి.. తాజాగా శవమై కనిపించింది.

