సాలూరు పట్టణ మున్సిపాలిటీ చైర్ పర్సన్ పువ్వుల.ఈశ్వరమ్మ గారి భర్త సీనియర్ రాజకీయ నాయకులు, సాలూరు పట్టణ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ మాజీ అధ్యక్షులు శ్రీ పువ్వుల.నాగేశ్వరరావు(67సం. లు)* గారు గత కొంతకాలంగా అనారోగ్యంతో భాధపడుతూ విశాఖపట్నం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న రాత్రి తుదిశ్వాస విడిచారు.ఈ విషయం తెలుసుకున్న *ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఉపముఖ్యమంత్రి , మాజీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పీడిక.రాజన్నదొర మరియు ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్,భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం సమన్వయకర్త* శ్రీ మజ్జి.శ్రీనివాస్ రావు ఈరోజు ఉదయం సాలూరు పట్టణంలో శ్రీ లక్ష్మీ,లక్ష్మీ థియేటర్ వద్ద ఉంచిన పువ్వుల.నాగేశ్వరరావు గారి పార్థివదేహాన్ని సందర్శించి పూలమాల వేసి దిగ్ర్భాంతి వ్యక్తం చేసారు. తదనంతరం కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ వారిని ఓదార్చి,ధైర్యం చెప్తూ ప్రగాఢ సానుభూతి తెలియజేసారు.నాగేశ్వరరావు గారి మరణం సాలూరు పట్టణ వైసీపీకి తీరని లోటని పలువురు రాజకీయ నాయకులు,పట్టణ ప్రజలు చర్చించుకుంటున్నారు.ఈ కార్యక్రమంలో సాలూరు నియోజకవర్గ వివిధ మండలాల రాజకీయ నాయకులు, పట్టణ కౌన్సిలర్లు,బంధువులు, స్నేహితులు,అభిమానులు మరియు తదితరులు పాల్గొన్నారు.





