ఈరోజు జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా సాలూరు అర్బన్ ఐ సి డి ఎస్ ఆధ్వర్యంలో సిడిపిఓ విజయలక్ష్మి ఆదేశాల మేరకు ఏ హెచ్ స్కూల్ బాలికలతో ర్యాలీ నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సూపర్వైజర్స్ రవణమ్మ భారతి తిరుపతమ్మ మాట్లాడుతూ ఆడపిల్ల చదువుకుంటేనే దేశ అభివృద్ధి సాధ్యమవుతుందని అంతేకాకుండా ప్రతి తల్లిదండ్రులు కూడా ఆడపిల్ల మగపిల్లాడు అనే వివక్ష చూపించకుండా ఆడపిల్లలను కచ్చితంగా చదివించాలని సూచించారు అంతేకాకుండా బాలికలకు 18 సంవత్సరాలు నిండకుండా బాల్య వివాహాలు చేయరాదని చేసినట్లయితే బాలికలు ఆటపాట్లకు దూరమై వారి యొక్క భావితరాల భవిష్యత్తు నాశనం అవుతుందని కావున ఆడపిల్లను కచ్చితంగా చదివించాలని కోరారు బేటి బచావో బేటి పడావో అంటూ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆడపిల్లలను చదివించమని ఆడపిల్లలను రక్షించమంటూ బాలికలకు ఎన్నో పథకాలను ఇస్తూ బాలికలను వారి తల్లిదండ్రులని ప్రోత్సహిస్తూ ప్రధాన మోడీ గారు చెప్పినట్లు తల్లిదండ్రులు ఆలోచించి ఆడపిల్లల పట్ల మరింత జాగ్రత్త తీసుకొని చదివించి వారి భవిష్యత్తుకి పునాదివేయాలని కోరారు ఈ కార్యక్రమంలో అంగన్వాడి కార్యకర్తలు వరలక్ష్మి కే జ్యోతి మరియు బాలికలు పాల్గొన్నారు


