స్ఫూర్తి మహిళ మండలి డైరెక్టర్ బలరాధా ఆధ్వర్యంలో జాతీయ బాలికల దినోత్సవం రవీంద్ర భారతి స్కూల్ బాలికలతో అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బార్ కౌన్సిల్ అసోసియేషన్ అధ్యక్షులు తాడి తిరుపతి రావు గారు హాజరయ్యారు ర్యాలీ రవీంద్ర భారతి స్కూల్ నుంచి రామ థియేటర్ వరకు నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బలగరాధ మరియు తిరుపతిరావు గారు మాట్లాడుతూ బాలికలు అన్ని రంగాల్లో ఉన్నత స్థాయిలో ఉండాలంటే ముఖ్యంగా చదువు అవసరమని ప్రతి ఒక బాలిక చదువు మీద దృష్టి పెట్టాలని చదువుతూనే దేశ భావితరాల భవిష్యత్తు ఆధారపడి ఉన్నదని తెలిపారు బాలికలు స్కూల్కి కాలేజీలకి వెళ్లేటప్పుడు ఎవరైనా పోకిరి వెధవలు ఈవిటీజింగ్ చేసేటప్పుడు ధైర్యంగా ఎదుర్కొని వాళ్లకి సరైన బుద్ధి చెప్పాలని తెలియజేశారు అంతేకాకుండా ఆడపిల్లలకు బాల్య వివాహాలు చేసి వారి జీవితాలను నాశనం చేయకూడదని వారి తల్లిదండ్రులకు వారి బంధువులకు తెలియజేయమని బాలికలకు సందేశాన్ని ఇచ్చారు ప్రభుత్వం కూడా బాలికల విద్యకు అన్ని రకాల సహాయపడుతూ ఎన్నో పథకాలను అందిస్తూ బాలికలకు ప్రోత్సహిస్తుందని అది ప్రతి ఒక్క తల్లిదండ్రులు బాలికలు, వినియోగించుకొని బాగా చదువుకొని ఉన్నత స్థాయిలో నిలబడి సమాజాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని బాలికలకు సూచించారు అనంతరం గుడ్ టచ్ బాడ్ టచ్ గురించి కూడా తెలియజేయడం జరిగినది అంతేకాకుండా ఆడపిల్లలను ఈ కార్యక్రమంలో మహిళలు బాలికలుపుట్టనిద్దాం ఆడపిల్లలను రక్షిద్దాం ఆడపిల్లలను చదివిద్దాం అంటూ రోడ్ దద్దరిల్లెల నినాదాలు ఇస్తూ ర్యాలీ నిర్వహించారు అనంతరం బాలికలతో ప్రతిజ్ఞ కూడా చేయించడం జరిగినది ఈ కార్యక్రమంలో బాలికలు మహిళలు పాల్గొనడం జరిగినది




