అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజినీరింగ్ కాలేజీలో ఘనంగా జరిగిన జాతీయ గణిత దినోత్సవం* :

అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజినీరింగ్ కాలేజీలో ఘనంగా జరిగిన జాతీయ గణిత దినోత్సవం* :

*అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజినీరింగ్ కాలేజీలో ఘనంగా జరిగిన జాతీయ గణిత దినోత్సవం* :
స్థానిక గరివిడి అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజనీరింగ్ కాలేజీలో సోమవారం మధ్యాహ్నం ప్రిన్సిపాల్ డాక్టర్ జె.బాల భాస్కరావు గారు అధ్యక్షతన జాతీయ గణిత దినోత్సవం ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమంలో ముందుగా ప్రముఖ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా కాలేజీ ప్రిన్సిపాల్ గారు మాట్లాడుతూ శ్రీనివాస రామానుజన్ గణిత శాస్త్రానికి అపారమైన సేవలు అందించారని తెలుపుతూ సంఖ్యా సిద్ధాంతం,నిరంతర భిన్నాలు,అనంత శ్రేణులు వంటి అనేక అంశాల్లో ఆయన చేసిన పరిశోధనలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయిని తెలియజేశారు.అలాగే గణితం మన దైనందిన జీవితంలో ఎంత ముఖ్యమో విద్యార్థులకు తెలియజేశారు.మరియు వైస్. ప్రిన్సిపల్ బి.వెంకటరమణ గారు మాట్లాడుతూ శ్రీనివాస రామానుజన్ భారతీయ గణిత శాస్త్ర గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప మేధావన్నారు.అలాగే గణితానికి అన్ని రంగాల్లో ప్రాధాన్యం ఉందని తెలియజేశారు.మరియు ఈ సందర్భంగా గణిత అధ్యాపకులు ఎల్.నవీన్ మాట్లాడుతూ గణితం అనేది కేవలం సంఖ్యలే కాదు,ఆలోచనా శక్తిని పెంచే శాస్త్రంమని తెలియజేశారు.అలాగే రామానుజన్,ఆర్యభట్ట, భాస్కరాచార్య తదితర గణిత శాస్త్రవేత్తల గొప్పతనాన్ని విద్యార్థులకు వివరించారు.ఈ సందర్భంగా బీ.టెక్ మరియు డిప్లమో విద్యార్థులకు గణిత శాస్త్రంపై ప్రతిభ పరీక్ష నిర్వహించి ప్రధమ,ద్వితీయ, తృతీయ బహుమతులను ప్రిన్సిపాల్ గారు చేతుల మీదుగా అందజేశారు.ఈ కార్యక్రమంలో ఏఓ జి.అనిల్ కుమార్,గణిత ఉపాధ్యాయులు,వివిధ విభాగాధిపతులు,విద్యార్థులు పాల్గొన్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి